ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suryakumar-Dube: దూబె-సూర్య సిక్సుల మోత.. బౌలర్లకు నరకం చూపించారు

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:57 PM

Suryakumar-Dube: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. అతడికి పించ్ హిట్టర్ శివమ్ దూబె కూడా తోడవడంతో బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. అతడికి పించ్ హిట్టర్ శివమ్ దూబె కూడా తోడవడంతో బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇద్దరూ సిక్సులు కొట్టడంలో పోటీపడటంతో పరుగుల వానలో ప్రత్యర్థి జట్టు తడిసి ముద్దయింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ముంబై జట్టు తరఫున బరిలోకి దిగిన సూర్య-దూబె ఆకాశమే హద్దుగా చెలరేగారు. సర్వీసెస్ బౌలర్లను ఉతికి ఆరేశారు.


సిక్సుల హోరు

సూర్యకుమార్ బౌండరీల మీద ఫోకస్ చేస్తే దూబె సిక్సులు కొట్టడమే పనిగా బ్యాటింగ్ చేశాడు. అయితే స్కై కూడా తగ్గలేదు. తన స్టైల్‌లో పలు భారీ షాట్లు బాదాడు. మొత్తంగా ఇద్దరూ కలసి 11 సిక్సులు కొట్టారు. సూర్య 46 బంతుల్లో 7 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 70 పరుగులు చేశాడు. దూబె 37 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 71 పరుగులు చేశాడు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. ఒకరితో ఒకరు పోటీపడి సిక్సులు కొట్టారు. దీంతో అపోజిషన్ టీమ్ బౌలర్లు గుడ్లు తేలేశారు. వీళ్లిద్దరి ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.


బౌలింగ్ భేష్

ఛేజింగ్‌కు దిగిన సర్వీసెస్ టీమ్ 19.3 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచాడు. అతడికి తోడుగా షమ్స్ ములానీ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఇక, ముంబై బ్యాటింగ్‌లో సూర్య-దూబె పార్ట్‌నర్‌షిప్ హైలైట్‌గా నిలిచింది. ఆ జట్టు సారథి అజింక్యా రహానె (20) మంచి స్టార్ట్ లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన టాలెంటెడ్ బ్యాటర్ పృథ్వీ షా (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తర్వాతి మ్యాచుల్లో అయినా ఈ ఓపెనర్ రాణిస్తాడేమో చూడాలి.


Also Read:

ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం

70 వేల కోట్లకు వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్

5 పరుగులు 4 వికెట్లు

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 03:03 PM