ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: పాకిస్థాన్ 30 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టీమిండియా

ABN, Publish Date - Feb 26 , 2024 | 03:59 PM

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీకి తోడు శుభ్‌మాన్ గిల్(52*), ధృవ్ జురేల్(39*) కీలక భాగస్వామ్యంతో 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

రాంచీ: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీకి తోడు శుభ్‌మాన్ గిల్(52*), ధృవ్ జురేల్(39*) కీలక భాగస్వామ్యంతో 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది. 2013 తర్వాత స్వదేశంలో టీమిండియా టాస్ ఓడిపోయాక 150+ పరుగులను చేధించి టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే మొదటి సారి. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన రోహిత్ సేన ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.


ఈ క్రమంలో పాకిస్థాన్ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును భారత జట్టు బద్దలుకొట్టింది. 1982 మార్చి- 1994 నవంబర్ మధ్య పాకిస్థాన్ జట్టు స్వదేశంలో వరుసగా 16 సిరీస్‌లు గెలిచింది. దీంతో స్వదేశంలో వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. తాజాగా 17 టెస్ట్ సిరీస్‌ విజయాలతో పాకిస్థాన్‌ను అధిగమించిన టీమిండియా రెండో స్థానానికి దూసుకెళ్లింది. దీంతో పాకిస్థాన్ మూడో స్థానానికి పడిపోయింది. దీంతో భారత్ దెబ్బకు పాకిస్థాన్ రికార్డు ఖతమైంది. కాగా భారత జట్టు 2013 నుంచి స్వదేశంలో వరుసగా 17 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. 1993 నవంబర్- 2008 నవంబర్ మధ్య స్వదేశంలో 28 టెస్ట్ సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 1974 ఫిబ్రవరి నుంచి 1994 ఏప్రిల్ మధ్య 16 టెస్ట్ సిరీస్‌లు గెలిచిన వెస్టిండీస్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. నవంబర్ 1987 నుంచి అక్టోబర్ 1999 మధ్య 14 టెస్ట్ సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఐదో స్థానంలో ఉంది. కాగా భారత జట్టు 2004 నుంచి 2012 మధ్య కూడా 14 టెస్ట్ సిరీస్‌లు గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 04:00 PM

Advertising
Advertising