IND vs ENG: హైదరాబాద్, వైజాగ్ టెస్టులకు భారత జట్టు ఎంపిక.. టీంలో తెలుగోడు!
ABN, Publish Date - Jan 13 , 2024 | 11:15 AM
ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈనెల 25 నుంచి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంట్లో భాగంగా శుక్రవారం జాతీయ సెలెక్టర్లు మొదట హైదరాబాద్, వైజాగ్ టెస్టుల కోసం 16 మందితో కూడిన పూర్తి స్థాయి బృందాన్ని ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈనెల 25 నుంచి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంట్లో భాగంగా శుక్రవారం జాతీయ సెలెక్టర్లు మొదట హైదరాబాద్, వైజాగ్ టెస్టుల కోసం 16 మందితో కూడిన పూర్తి స్థాయి బృందాన్ని ఎంపిక చేసింది. ఈ సిరీస్‌లో ఆడాలనుకున్న పేసర్ మహ్మద్ షమిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సకు దూరమైన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు ఈసారి జట్టులో చోటు కల్పించారు. వీరికి తోడు వెటరన్స్ జడేజా, అశ్విన్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నారు.
అయితే ఇటీవల వార్తల్లో నిలుస్తున్న వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఈ సిరీస్‌కు కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడం గమనార్హం. అతడి స్థానంలో బ్యాకప్ కీపర్‌గా యూపీ యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌ను తొలిసారి జట్టుకు ఎంపిక చేశారు. గతేడాదే అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రవేశించగా, ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున సౌతాఫ్రికాలోనూ పర్యటించాడు. ప్రస్తుత జట్టులో అతడొక్కడే కొత్త ప్లేయర్. రాహుల్, కేఎస్ భరత్ ఇతర కీపర్లు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు కూడా చోటు దక్కడం గమనార్హం. అలాగే రంజీల్లో విశేషంగా రాణిస్తున్న వెటరన్ పుజార ప్రదర్శనను కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరో పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ రంజీల్లో గాయపడడంతో బుమ్రా, అవేశ్ ఖాన్, ముకేశ్, సిరాజ్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నారు. సఫారీ టూర్‌లో ధారాళంగా పరుగులిచ్చుకున్న శార్దూల్‌పై వేటు పడింది.
టీమిండియా స్క్వాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jan 13 , 2024 | 11:15 AM