T20 World Cup: భారత టీ20 వరల్డ్‌కప్ స్వ్కాడ్‌లో ఆ ముగ్గురు స్టార్స్‌కి నో ఛాన్స్..?
ABN, Publish Date - Apr 25 , 2024 | 08:04 AM
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగమయ్యే ఆయా దేశాలు.. తమ జట్లను మే 1వ తేదీలోపు ప్రకటించాలని ఐసీసీ (ICC) పేర్కొంది. దీంతో.. భారత సెలక్టర్లు ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈలోపే మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుందన్న సూచనలు ఇస్తున్నారు. అలాగే.. తమ అంచనాలతో కూడిన జట్లను కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్‌లతో (Irfan Pathan) పాటు పలువురు మాజీలు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే జట్టుని అంచనా వేశారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ వైల్డ్ కార్డ్ ఏంట్రి..?
తాజాగా ఈ జాబితాలో అంబటి రాయుడు (Ambati Rayudu) చేరిపోయాడు. టీ20 వరల్డ్‌కప్‌లో 15 మందితో కూడిన తన జట్టుని అనౌన్స్ చేశాడు. అయితే.. ఇందులో అతను ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు చోటు ఇవ్వలేదు. వాళ్లే.. హార్దిక్ పాండ్యా (ఆల్‌రౌండర్), రిషభ్ పంత్, కేఎల్ రాహుల్. పాండ్యా స్థానంలో రియాన్ పరాగ్‌కు అతడు చోటు ఇచ్చాడు. అలాగే.. వికెట్ కీపర్ కోటాలో దినేశ్ కార్తిక్‌కి చోటిచ్చాడు. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్‌ని సైతం రాయుడు పక్కన పెట్టేశాడు. ఫినిషర్‌గా డీకే అద్భుతంగా ఆడుతుండటంతో.. అతనికే తన జట్టులో అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా.. ఈ సీజన్‌లో అదరగొడుతున్న పేస్ సంచలనం పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌ని కూడా ఎంపిక చేశాడు.
ఐపీఎల్ చరిత్రలోనే.. మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్
తాను ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడు టాప్-4లో.. రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్లలకు చోటు దక్కింది. మిడిలార్డర్ కోటాలో రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబేలను ఎంపిక చేసిన రాయుడు.. వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తిక్‌ని సెలక్ట్ చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో ఒక్క రవీంద్ర జడేజాకు మాత్రమే చోటు ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు.. స్పెషలిస్టు స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేయడం జరిగింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 25 , 2024 | 08:07 AM