ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shivam Dube: శివమ్ దూబే చీటింగ్ చేశాడా.. అంపైర్ ఎందుకలా చెక్ చేశాడు?

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:23 PM

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..

Umpire Suspiciously Checks Shivam Dube Pocket

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే (Shivam Dube) బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరీ (Anil Chaudhary) తనిఖీ చేశాడు. దీంతో.. అంపైర్ ఎందుకిలా చేశాడని అందరూ చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?


అయితే.. అంపైర్ ఇలా దూబే జేబుల్ని చెక్ చేయడం వెనుక ఓ కారణం ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దూబే ప్యాంట్ జేబుల్లో ఏదో ఉందన్నట్టు అనుమానం రావడంతో.. అంపైర్ అనిల్ ఇన్నింగ్స్ మధ్యలో అతడి జేబుల్ని తనిఖీ చేయడం జరిగింది. అప్పుడప్పుడు ఆటగాళ్లు బంతి ఆకారాన్ని లేదా స్థితిని మార్చేందుకు.. తమతో పాటు కొన్ని వస్తువులు తీసుకొస్తుంటారు. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారాల గురించి అందరూ వినే ఉంటారు. బహుశా.. దూబే కూడా అదే పని చేసేందుకు ఏదైనా వస్తువు వెంట తెచ్చుకున్నాడేమోనన్న ఉద్దేశంతో.. అనిల్ ఇలా జేబులను పరిశీలించినట్లు తెలుస్తోంది. లేకపోతే.. మరో ఇతర కారణం ఏమైనా ఉందా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా.. ఈ టాపిక్ మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్ అవుతోంది.

హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57) అర్థశతకంతో చెలరేగడం.. రహానే (36), మోయిన్ అలి (30) మెరుగ్గా రాణించడం.. చివర్లో ధోనీ (28) మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే అంత స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. లక్నో జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కేఎల్ రాహుల్ (82) మెరవడం, డీకాక్ (54) అర్థశతకంతో చేయూతనందించడంతో.. లక్నో సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేధించగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 12:56 PM

Advertising
Advertising