ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SMAT 2024: హార్దిక్ పాండ్యాను ఉతికి ఆరేసిన సీఎస్‌కే బ్యాటర్.. పిచ్చకొట్టుడు కొట్టాడు

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:55 PM

SMAT 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఓ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ బాదిపారేశాడు. అతడి బౌలింగ్‌లో పిచ్చకొట్టుడు కొట్టాడు. వరుస సిక్సులతో హోరెత్తించాడు.

టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ స్కిల్స్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. బ్యాటింగ్ టైమ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోర్లు అందించే పాండ్యా.. బౌలింగ్ సమయంలో కీలకమైన బ్రేక్‌త్రూలు అందిస్తూ జట్టు విజయాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. పించ్ హిట్టింగ్‌తో పాటు నిఖార్సయిన పేస్ బౌలింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో భారత జట్టుకు బిగ్ ఎస్సెట్‌గా మారాడు హార్దిక్. అంత టాప్ ప్లేయర్‌ను ఓ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు బాదిపారేశాడు. అతడి బౌలింగ్‌లో వరుస సిక్సులతో హోరెత్తించాడు. ఎవరా బ్యాటర్ అనేది ఇప్పుడు మనం చూద్దాం..


టార్గెట్ చేసి మరీ..

హార్దిక్ పాండ్యాను ఉతికి ఆరేశాడు విజయ్ శంకర్. అతడి బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సులు బాదాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా బరోడా-తమిళనాడు జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్.. భారీ సిక్సులు కొట్టాడు. 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సులు ఉండగా.. పాండ్యా బౌలింగ్‌లోనే మూడు సిక్సులు కొట్టడం విశేషం. లెగ్ సైడ్ ఒకటి, ఆఫ్ సైడ్ రెండు సిక్సులు కొట్టి హార్దిక్‌ను భయపెట్టాడు విజయ్ శంకర్.


ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

విజయ్ శంకర్ విధ్వంసక బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగగిన తమిళనాడు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన బరోడా ప్రస్తుతం 5.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులతో ఉంది. బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 44 రన్స్ ఇచ్చుకున్న పాండ్యా.. బ్యాటింగ్‌లోనైనా రాణిస్తాడేమో చూడాలి. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో విజయ్ శంకర్‌ను రూ.1.20 కోట్ల ధరకు సీఎస్‌కే దక్కించుకుంది. ఈ తరుణంలో ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు చెలరేగడంతో చెన్నై ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ను చెన్నై ప్లేయర్ బాదేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, విజయ్ శంకర్ గతంలో టీమిండియాకు ఆడిన విషయం తెలిసిందే. 21 మ్యాచుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడతను.


Also Read:

సిరాజ్‌పై ప్రేమ చంపుకోని ఆర్సీబీ

మళ్లీ ఆసీస్ పొగరు అణిచిన బుమ్రా.. పుండు మీద కారం చల్లాడు

28 బంతుల్లోనే సెంచరీ.. అన్‌సోల్డ్ ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

For More Sports And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 07:01 PM