IPL 2024: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
ABN, Publish Date - Mar 26 , 2024 | 05:10 PM
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు.
బెంగళూరు: ఐపీఎల్ 2024లో ( IPL 2024) భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చెలరేగాడు. తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ కోహ్లీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 11 ఫోర్లు, 2 సిక్సులతో 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ రికార్డు సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో కోహ్లీకి ఇది 100వ 50+ స్కోర్ కావడం గమనార్హం. ఇందులో 8 సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. గేల్ 110 సార్లు 50+ స్కోర్లు సాధించగా.. వార్నర్ 109 సార్లు 50+ స్కోర్లు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 176/6 స్కోర్ సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 45 పరుగులతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కింగ్ కోహ్లీ(77) చెలరేగాడు. ఒకానొక దశలో పంజాబ్ జట్టే గెలుస్తుందేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దినేష్ కార్తీక్(28), మహీపాల్ లోమ్రోర్(17) ఆర్సీబీని గెలిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్
Updated Date - Mar 26 , 2024 | 05:11 PM