ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: కొత్త టీమ్‌తో కోహ్లీ.. ఇకపై అంతా వాళ్ల చేతుల్లోకి..

ABN, Publish Date - Nov 07 , 2024 | 08:39 PM

వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్‌లో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అలాంటి విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త టీమ్‌తో జతకట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Virat Kohli: వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కెరీర్‌లో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. టీ20 వరల్డ్ కప్‌-2024 ఫైనల్‌లో ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే ఈ ఏడాది అతడి బ్యాట్ పెద్దగా గర్జించింది లేదు. ఇటీవల కాలంలో చూసుకుంటే.. శ్రీలంక టూర్ నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ వరకు అంతటా వైఫల్యాలే చూస్తున్నాడు. దీంతో అతడిపై విమర్శల తాకిడి పెరిగింది. కింగ్‌కు ఏమైంది అంటూ అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌లోనైనా అతడు ఫామ్‌ను అందుకుంటాడా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కింగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త టీమ్‌తో జతకట్టాలని అతడు డిసైడ్ అయ్యాడు.


వాళ్లకు బాధ్యతలు

కోహ్లీ తన మేనేజ్‌మెంట్ టీమ్‌ను మార్చేశాడు. తాము నటించే యాడ్స్, ఎండార్స్‌మెంట్స్ నుంచి బిజినెస్ వ్యవహారాల వరకు చూసుకోవడానికి మేనేజ్‌మెంట్ టీమ్స్‌ను పెట్టుకుంటారు సెలెబ్రిటీలు. కోహ్లీకి కూడా అలాంటి ఓ టీమ్ ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మార్చేశాడు. స్పోర్టింగ్ బియాండ్ అనే కొత్త మేనేజ్‌మెంట్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన వ్యాపార వ్యవహారాలు అన్నింటినీ ఈ కంపెనీనే చూసుకుంటుందని కింగ్ స్పష్టం చేశాడు.


కార్నర్‌స్టోన్‌కు గుడ్‌బై

ఇప్పటివరకు కార్నర్‌స్టోన్ అనే కంపెనీ కోహ్లీ బిజినెస్ వ్యవహారాలను చూసుకునేది. అయితే ఆ సంస్థతో అతడు తెగదెంపులు చేసుకున్నాడని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా స్పోర్టింగ్ బియాండ్‌తో కలసి ముందుకెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని కోహ్లీ ప్రకటించడంతో అది నిజమని ప్రూవ్ అయింది. ‘స్పోర్టింగ్ బియాండ్‌తో కలసి ముందుకెళ్తున్నా. ఇదే నా న్యూ టీమ్. గత కొన్నాళ్లుగా వీళ్లతో ప్రయాణిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో విరాట్ తెలిపాడు. తన లక్ష్యాలు, విలువలు, పాదర్శకత గురించి ఈ సంస్థకు తెలుసునని.. ఈ టీమ్‌తో తన జర్నీ ఆసక్తికరంగా సాగుతోందన్నాడు. మరి.. మన దేశంలో మోస్ట్ వ్యాల్యూడ్ సెలెబ్రిటీస్‌లో ఒకడిగా ఉన్న కోహ్లీ కొత్త మేనేజ్‌మెంట్ టీమ్ రాకతో తన బ్రాండ్ వ్యాల్యూను ఇంకెంత పెంచుకుంటాడో చూడాలి.


Also Read:

అయ్యర్ ఈజ్ బ్యాక్.. టీమిండియాలోకి రీఎంట్రీ

ఆసీస్‌కు పోయించిన జురెల్.. సోల్జర్ కొడుకు కదా ఆ మాత్రం ఉంటది

రాజభోగాలు వీడండి.. రంజీలు ఆడండి

For More Sports And Telugu News

Updated Date - Nov 07 , 2024 | 08:45 PM