IPL 2024: విరాట్ కోహ్లీ అభిమానిని చితక్కొట్టిన సెక్యూరిటీ సిబ్బంది.. వీడియో వైరల్
ABN, Publish Date - Mar 27 , 2024 | 05:59 PM
ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ (Royal Challengers Bengaluru vs Punjab Kings) జట్లు తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. కోహ్లీ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అతని పాదాలకు మొక్కాడు. కోహ్లీ పాదాలను బిగ్గరగా పట్టుకున్నాడు. ఆ తర్వాత పైకి లేచి కోహ్లీని కౌగిలించుకున్నాడు. ఇంతలోనే మైదానం భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి సదరు అభిమానిని బయటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అలా సదరు అభిమానిని బయటికి తీసుకెళ్లిన స్టేడియం సిబ్బంది అతనిని కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సదరు అభిమానిని స్టేడియం నిర్వహకులు చితకబాదడం వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి అభిమానిపై దాడిని ఖండించాడు. అతనిని జైలులో పెట్టడం లేదా జరిమానా విధించడం చేయవచ్చని, కానీ కొట్టడమేంటని ప్రశ్నించాడు. చట్టం ప్రకారం అతడిని కొట్టే హక్కు వారికి లేదని ట్వీట్ చేశాడు. అయినప్పటికీ కొట్టడం వల్ల చట్టం ఉండడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 176/6 స్కోర్ సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 45 పరుగులతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కింగ్ కోహ్లీ(77) చెలరేగాడు. ఒకానొక దశలో పంజాబ్ జట్టే గెలుస్తుందేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దినేష్ కార్తీక్(28), మహీపాల్ లోమ్రోర్(17) ఆర్సీబీని గెలిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs MI: మన హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
SRH vs MI: హైదరాబాద్ వేదికగా ముంబై దిగ్గజ బౌలర్ రికార్డును సమం చేయనున్న బుమ్రా
Updated Date - Mar 27 , 2024 | 05:59 PM