Kohli-Ashwin: డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్.. అశ్విన్ ఇలా అనేశాడేంటి
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:04 PM
Kohli-Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏది చెప్పాలనుకున్నా తడబడకుండా చెప్పేస్తాడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకుంటాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏది చెప్పాలనుకున్నా తడబడకుండా చెప్పేస్తాడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకుంటాడు. అందుకే అతడి బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫిదా అయిపోయారు. క్రికెట్ వరల్డ్‌లో జరిగే విషయాలపై అశ్విన్ చేసే కామెంట్స్ బాగా వైరల్ అవుతుంటాయి. లాజిక్స్ మిస్ అవకుండా మాట్లాడతాడు, దూరదృష్టితో వ్యవహరిస్తాడు కాబట్టే అతడి కామెంట్స్‌కు అందరూ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటోడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్ అంటూ ఆసక్తికర చర్చకు దారితీశాడు.
అంతా తానై నడిపిస్తాడు
జట్టుకు కోహ్లీనే కెప్టెన్.. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అన్నాడు అశ్విన్. అతడి కంటే సమర్థవంతమైన సారథి మరొకరు లేరని చెప్పాడు. అయితే టీమిండియాకు ఆల్రెడీ రోహిత్ శర్మ రూపంలో సాలిడ్ కెప్టెన్ ఉన్నాడు.. అలాంటప్పుడు కోహ్లీనే సారథి అంటూ అశ్విన్ కొత్త మెలిక ఎందుకు పెట్టాడని అభిమానులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే అశ్విన్ చెప్పింది ఆర్సీబీ సారథ్యం గురించి. వచ్చే సీజన్‌లో బెంగళూరును కోహ్లీనే ముందుండి అంతా తానై నడిపిస్తాడని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంకో ఆప్షన్ లేదు
‘ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఆర్సీబీ తాను అనుకున్నది సాధించడంలో సక్సెస్ అయింది. వాళ్లు అడ్డగోలుగా ఎవరు పడితే ఆ ఆటగాళ్లను తీసుకోలేదు. స్టార్ల వెంబడి పడలేదు. తమ ప్లానింగ్‌కు తగ్గట్లు ఓపికతో వ్యవహరించి అనుకున్నది రాబట్టుకోగలిగారు. డబ్బులు ఉన్నాయి కదా అని తొందరపడకుండా తమ కూర్పులో ఎవరు సెట్ అవుతారో వారినే తీసుకున్నారు. హేజల్‌వుడ్, భువనేశ్వర్, యష్ దయాల్ లాంటి సాలిడ్ బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ యూనిట్ కూడా బలంగానే ఉంది. ఈ టీమ్‌ను కోహ్లీనే కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తాడని భావిస్తున్నా. వాళ్లు సారథి కావాలని వేలంలో ఇతర ప్లేయర్ కోసం వెళ్లలేదు. ఆ పగ్గాలు చేపట్టే మరో వ్యక్తి జట్టులో కనిపించడం లేదు. కాబట్టి విరాటే కెప్టెన్ అని అనుకుంటున్నా’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Also Read:
దిగొచ్చిన పాకిస్థాన్
ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ
విరాట్‌ను దాటేశాడు
అదరగొట్టిన రోహిత్, తిలక్
For More Sports And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 05:05 PM