Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..
ABN, Publish Date - May 16 , 2024 | 01:44 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా తన రిటైర్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు కొట్టాడు. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన కెరీర్‌ని ముగించాలని అనుకుంటున్నానని, ఆటలో కొనసాగేంతవరకు తన బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..
‘‘స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుంది. అందుకే.. నేను ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నా. నేనుప్పుడూ ‘అయ్యో ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది’ అనే పశ్చాత్తాపంతో నా కెరీర్‌ని ముగించాలని అనుకోవడం లేదు. అలా ఆలోచిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ముందుకు సాగలేం. నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను. అక్కడితోనే ఆ విషయాన్ని వదిలేసి, ఆ తర్వాత చేయగలిగే వాటి గురించే ఆలోచిస్తా’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌కు వీడ్కోలు పలికాక నేను చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘ విరామం తీసుకుంటా. కాబట్టి.. నేను క్రికెట్‌లో కొనసాగేంతకాలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నిస్తా. ఆ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?
కాగా.. కోహ్లీ ఎప్పుడూ తన రిటైర్‌మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడింది లేదు. గతంలో తనపై తారాస్థాయి విమర్శలొచ్చినప్పుడు కూడా పెదవి విప్పలేదు. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా మాట్లాడటం చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉన్న కోహ్లీ.. ఈమధ్య ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో (IPL 2024) 13 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 155.16 స్ట్రైక్ రేట్, 66.10 సగటుతో 661 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని అందరూ నమ్ముతున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 16 , 2024 | 01:44 PM