ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cricket: 70 వేల కోట్ల ఆస్తికి వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్.. ఈ రిచెస్ట్ క్రికెటర్ తెలుసా..

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:35 PM

Cricket: రిచెస్ట్ క్రికెటర్ గేమ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 22 ఏళ్లకే ఆట నుంచి నిష్క్రమించాడు. 70 వేల కోట్లకు వారసుడైన ఆ ప్లేయర్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..

అత్యంత ధనిక క్రికెటర్లు ఎవరంటే ఠక్కున విరాట్ కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఆ తర్వాత టీమిండియా లెజెండ్స్ మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ పేర్లు చెబుతారు. వీళ్లు ముగ్గురూ భారత్‌‌కు ఆడటంతో పాటు ఐపీఎల్‌లో ఆడుతూ బాగా సంపాదించారు. యాడ్ రెవెన్యూ రూపంలోనూ భారీ మొత్తాన్ని వెనకేసుకున్నారు. కొన్ని వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్, సొంత బిజినెస్‌తో వందల కోట్లకు పడగలెత్తారు. అయితే పైన చెప్పిన కోహ్లీ, ధోని, సచిన్ బాగానే సంపాదిస్తున్నా అత్యంత ధనార్జన కలిగిన క్రికెటర్లలో ఓ ప్లేయర్‌ను మాత్రం దాటలేకపోయారు. అతడే ఆర్యమన్ బిర్లా. ఆస్తి విషయంలో ఆర్యమన్‌కు దగ్గరలో ఏ ప్లేయర్ కూడా లేడు.


క్రికెట్ వైపు అడుగులు

ఆర్యమన్ బిర్లా ఆస్తుల విలువ అక్షరాలా 70 వేల కోట్లు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా వారసుడైన ఈ యంగ్ క్రికెటర్ అనూహ్యంగా 22 ఏళ్లకే క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. 1997లో జన్మించిన ఆర్యమన్.. చిన్నప్పటి నుంచి క్రికెట్ వైపు అడుగులు వేశాడు. 2017లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన బ్యాటింగ్ టాలెంట్‌తో మంచి క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు.


ఐపీఎల్‌లోనూ..

డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టు తరఫున ఆడాడు ఆర్యమన్ బిర్లా. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచులు, లిస్ట్‌-ఏలో 4 మ్యాచులు ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌లో 414 పరుగులు చేశాడు. అతడి హయ్యెస్ట్ స్కోరు 103 నాటౌట్. బెంగాల్‌పై సూపర్ సెంచరీతో టీమ్‌ను ఓటమి నుంచి బయటపడేశాడు. ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు రాజస్థాన్‌కు ఆడినా.. తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. గాయాలతో ఇబ్బంది పడుతూ 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడతను. ఆ తర్వాత బిజినెస్ వైపు టర్న్ తీసుకున్నాడు.


ఆస్తిలో సాటిరారు

రిటైర్మెంట్ తర్వాత వ్యాపార రంగం వైపు మలుపు తీసుకున్న ఆర్యమాన్ బాగా సక్సెస్ అయ్యాడు. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు. బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ లిమిటెడ్‌కూ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి నికర ఆస్తి విలువ రూ.70 వేల కోట్లకు పైనే ఉంది. అదే సచిన్ ఆస్తి రూ.1,100 కోట్లుగా ఉంది. కోహ్లీ సంపద రూ.900 కోట్లు, ధోని ఆస్తి రూ.800 కోట్లు మాత్రమే.


Also Read:

అశ్విన్‌.. అవసరమెంత?

5 పరుగులు 4 వికెట్లు

కతార్‌ జీపీ విజేత వెర్‌స్టాపెన్‌

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 01:42 PM