Team India Coach: టీమిండియా కోచ్ కోసం గట్టి పోటీ..!!
ABN, Publish Date - Jun 19 , 2024 | 10:37 AM
టీమిండియా హెడ్ కోచ్ వేటలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) బిజీగా ఉంది. కోచ్ పదవి కోసం మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డబ్ల్యూవి రామన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరిని క్రికెట్ అడ్వైజరి కమిటీ హెడ్ అశోక మల్హొత్రా మంగళవారం ఆన్ లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు.
టీమిండియా హెడ్ కోచ్ వేటలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) బిజీగా ఉంది. కోచ్ పదవి కోసం మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డబ్ల్యూవి రామన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరిని క్రికెట్ అడ్వైజరి కమిటీ హెడ్ అశోక మల్హొత్రా మంగళవారం ఆన్ లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు. రెండో రౌండ్ బుధవారం (ఈ రోజు) జరగనుంది. ఇంతలో డబ్ల్యూవి రామన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
పోస్ట్ ఏంటంటే..?
రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి ఈ నెలలో వైదొలుగుతారు. ద్రావిడ్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావించింది. కంటిన్యూ అయ్యేందుకు ద్రావిడ్ అంగీకరించలేదు. హెడ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించింది. మొదట్లో చాలామంది పేర్లు వినిపించాయి. ప్రస్తుతం గౌతమ్ గంభీర్, డబ్ల్యూవి రామన్ వద్ద ఆగాయి. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ తర్వాత రామన్ చేసిన పోస్ట్ చర్చకు దారితీసింది. అందులో ‘ఓహ్ డియర్’ అని మాత్రమే చేశారు. ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారో తెలియడం లేదు.
ఇద్దరు ఆసక్తి
కోచ్ పదవిపై గంభీర్, రామన్ ఇద్దరు ఆసక్తితో ఉన్నారు. తనకంటే తనకు పదవి వస్తుందని భావిస్తున్నారు. కోచ్ పదవి తనకే దక్కుతుందని గంభీర్ ధీమాతో ఉన్నారు. సీఏసీ సభ్యులను తాను ఇచ్చిన ప్రజంటేషన్ నచ్చిందని రామన్ అంటున్నారు. రామన్‌కు మహిళల టీమ్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గంభీర్ టీమిండియా తరఫున ఆడారు. ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా ఉన్నారు. 2024 ఐపీఎల్‌లో గంభీర్ చేసిన ప్రయోగాలు ఫలించాయి. కోల్ కతా టైటిల్ కొట్టడంలో సక్సెస్ అయ్యింది. వీరిద్దరిలో ఎవరు కోచ్ కానున్నారో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
Updated Date - Jun 19 , 2024 | 10:54 AM