ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yashasvi Jaiswal: జైస్వాల్ ఔట్.. దద్దరిల్లిన స్టేడియం.. ‘బాహుబలి’ని తలపించే సీన్

ABN, Publish Date - Dec 31 , 2024 | 08:10 PM

BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌‌లో టీమిండియా ఓటమి అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. జైస్వాల్-పంత్ ఎంత పోరాడినా భారత్‌ను కాపాడలేకపోయారు.

Yashasvi Jaiswal

IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌‌లో టీమిండియా ఓటమి అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. యశస్వి జైస్వాల్- రిషబ్ పంత్ ఎంత పోరాడినా భారత్‌ను కాపాడలేకపోయారు. సాలిడ్ డిఫెన్స్‌తో గోడ కట్టినా దాన్ని కంగారూలు బ్రేక్ చేశారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లకు అడ్డంగా నిలబడిపోయాడు. కానీ ఆసీస్ ఫైట్‌ చేసిన విధానానికి అతడూ తలొగ్గక తప్పలేదు. ఇంకో అరగంట సేపు పోరాడి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ అది సాధ్యం కాలేదు. గెలిచి తీరాలనే కమిన్స్ సేన సంకల్పానికి మెన్ ఇన్ బ్లూ సరెండర్ అవక తప్పలేదు. అయితే ఈ టెస్ట్‌ ఆఖరి రోజు జరిగిన ఓ ఇంట్రెస్టింగ్‌ సీన్‌కు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.


అరుపులతో అట్టుడికింది

మెల్‌బోర్న్ టెస్ట్ ఆఖరి రోజు యశస్వి జైస్వాల్ ఔటైన సమయంలో స్టేడియం దద్దరిల్లింది. అక్కడి భారత అభిమానులు అతడు నాటౌట్ అంటూ రచ్చ రచ్చ చేశారు. జైస్వాల్.. జైస్వాల్.. అంటూ గట్టిగా అరిచారు. ఎలా ఔట్ ఇస్తారంటూ గోల గోల చేశారు. భారత ఓపెనర్ ఔటై డ్రెస్సింగ్ రూమ్ దిశగా నడుస్తూ వెళ్తున్న సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ డబుల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్‌ను ఇది తలపించింది. అందులో బాహుబలి అనే నేను.. అని రెబల్ స్టార్ డైలాగ్ చెప్పగానే అక్కడి ప్రజలు బాహుబలి జయహో అంటూ గట్టిగా అరుస్తూ ఆ ప్రాంగణం దద్దరిల్లేలా చేస్తారు. నిన్నటి మ్యాచ్‌లో జైస్వాల్ ఔట్ టైమ్‌లో ఇదే రిపీట్ అయింది.


ఔటా? నాటౌటా?

జైస్వాల్ ఔటైన తీరుపై కాంట్రవర్సీ చెలరేగింది. ప్యాట్ కమిన్స్ వేసిన బంతిని అతడు హుక్ చేయడానికి ప్రయత్నించగా.. బాల్ గ్లౌవ్స్‌ను రాసుకున్నట్లుగా వెళ్లి కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో వెళ్లి పడింది. క్యాచ్ కోసం కంగారూ ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ జోయల్ విల్సన్ తిరస్కరించాడు. దీంతో డీఆర్ఎస్ తీసుకున్నారు. బాల్ గ్లోవ్స్‌ను తాకినట్లు స్నికో చూపించలేదు. ఔట్ అనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయినా థర్డ్ అంపైర్ సైకిత్ షర్ఫుద్దౌలా జైస్వాల్‌ను ఔట్‌గా డిక్లేర్ చేశాడు. బాల్ పక్కకు వెళ్లినట్లు కనిపించడంతో అతడు ఈ డెసిషన్ తీసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. చీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. వాళ్ల గోల, అరుపులతో మొత్తం స్టేడియం దద్దరిల్లింది. జైస్వాల్ నామస్మరణతో మార్మోగింది. ఈ వికెట్ గానీ పడకపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండేది. అందుకే అభిమానులు సీరియస్ అయ్యారు. మ్యాచ్‌ను ముంచారు కదరా అంటూ ఫైర్ అయ్యారు.


Also Read:

తెలుగోడ్ని నమ్మని రోహిత్.. పాపం సెంచరీ కొట్టినా..

మ్యాచ్ పోయినా రివేంజ్ కంప్లీట్.. స్లెడ్జింగ్‌కు భయపడేలా చేశాడుగా..

టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..

అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు

For More Sports And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 08:47 PM