Lok Sabha elections 2024: ఆ వార్తలను ఖండించిన క్రికెటర్ యువరాజ్ సింగ్
ABN, Publish Date - Mar 02 , 2024 | 09:16 AM
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తలను మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఖండించారు. తాను ఎన్నికల బరిలో నిలవడం లేదంటూ స్పష్టం చేశారు. బీజేపీ తరఫున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ కథనాలపై తాజాగా యువరాజ్ సింగ్ స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వార్తలను ఖండించారు. ఎన్నికల బరిలో నిలవక పోయినప్పటికీ తన యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని వెల్లడించారు. ‘‘మీడియాలో వస్తోన్న కథనాలకు నేను వ్యతిరేకం. గురుదాస్‌పూర్ నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా స్థాయికి తగ్గట్టు ప్రజలకు సాయం చేయడమే నా అభిరుచి. నా యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మార్పు తీసుకురావడం కోసం మన సామర్థ్యం మేర ప్రయత్నిద్దాం.’’ అని ఎక్స్‌లో యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.
కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున యువరాజ్ సింగ్ పోటీ చేయబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. గత నెలలో యువరాజ్ సింగ్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలవడంతో ఈ వార్తలు బయటికొచ్చాయి. ఇక ప్రస్తుతం గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ప్రముఖ నటుడు సన్ని డియోల్ ఉన్నారు. సన్నీ డియోల్‌ను పక్కనపెట్ట మరి యువరాజ్ సింగ్‌ను బీజేపీ బరిలో దింపనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా యువరాజ్ సింగ్ ఆ వార్తలను ఖండించడంతో ఈ ప్రచారానికి తెరపడింది. 42 ఏళ్ల యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సులు కొట్టి సంచలనం సృష్టించారు. ఆల్‌రౌండర్‌గా టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 09:18 AM