Fact Check: హుక్కా తాగుతున్న ధోనీ.. అసలు నిజం ఏంటంటే..!
ABN, Publish Date - Jan 07 , 2024 | 04:05 PM
క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హుక్కా తాగుతాడా? నమ్మడానికి కాస్త కష్టమయినా.. ధోనీ హుక్కా తాగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. ఈ హుక్కా కారణంగా ధోనీ మరోసారి టాప్ వార్తల్లో నిలిచాడు.
న్యూఢిల్లీ, జనవరి 07: క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హుక్కా తాగుతాడా? నమ్మడానికి కాస్త కష్టమయినా.. ధోనీ హుక్కా తాగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. ఈ హుక్కా కారణంగా ధోనీ మరోసారి టాప్ వార్తల్లో నిలిచాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. ఇలా హుక్కా సేవించి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ధోనీని ప్రశ్నిస్తున్నారు.
ఆ వీడియోలో నిజమెంత?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ధోనీ హుక్కా సేవిస్తున్నట్లు కనిపిస్తుంది నిజమే. కానీ, ఇది ఓ అడ్వర్టైజ్మెంట్లో భాగంగా చిత్రీకరించడం జరిగింది. ఓ యాడ్ కోసం లెజెండరీ స్కిప్పర్ ఇలా హుక్కా సేవించాల్సి వచ్చిందని సదరు యాడ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక ఈ వీడియోలో ధోనీతో పాటు.. నటుడు సన్నీ సింగ్ కూడా ఉన్నాడు. ఆ పక్కనే రాపర్ ఎంసీ స్టాన్ కూడా ఉంటడం చూడొచ్చు.
సమరానికి సైం అంటోన్న సీఎస్కే..
వాస్తవానికి ఎంఎస్ ధోని ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడని టాక్. నెట్స్‌లో ఎప్పుడూ వ్యాయామం చేస్తూ కనిపిస్తాడు. ధోనీ ఫిట్నెస్ కారణంగానే.. టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణించగలుగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ధోనీనే అధిక వయస్కుడైన కెప్టెన్. గత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి.. సీఎస్కే ఐదో టైటిల్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 కోసం సన్నాహాల్లో భాగంగా త్వరలో నెట్స్‌లో ప్రాక్టిస్ మొదలుపెట్టనున్నాడు. సీఎస్కే కి కెప్టెన్‌గా మరోసారి వ్యవహరించనున్న విషయం తెలిసిందే. గత సీజన్లో ట్రోఫీని కైవసం చేసుకున్న సీఎస్కే.. ఈసారి కూడా అదే పట్టుదలతో టైటిల్ కొట్టాలని భావిస్తోంది. మార్చి మొదటి వారం నుంచే సీఎస్కే టీమ్ తమ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Updated Date - Jan 07 , 2024 | 04:05 PM