ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gambhir, Kohli's Joy: నవ్వులు... అంతలోనే మాడిన మొహలు

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:54 AM

టీ 20ల్లో శ్రీలంక జట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. సిరీస్ క్లీన్ స్విప్ చేసింది. నిన్న జరిగిన తొలి వన్డేలో లంక జట్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 230 పరుగుల వద్ద ఆగింది.

Gautam Gambhir, Virat Kohli's

టీ 20ల్లో శ్రీలంక జట్టును టీమిండియా (Team India) వైట్ వాష్ చేసింది. సిరీస్ క్లీన్ స్విప్ చేసింది. నిన్న జరిగిన తొలి వన్డేలో లంక జట్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 230 పరుగుల వద్ద ఆగింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచింది.


విజయంపై ధీమా.. కానీ..?

మ్యాచ్ చూసిన టీమిండియా అభిమానులు విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. చివర్లో బ్యాట్స్ మెన్ కొంప ముంచారు. చేతిలో బంతులు ఉన్న అందరూ ఔటయ్యారు. 47 ఓవర్‌లో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. విజయానికి ఐదు పరుగుల దూరంలో ఉంది. శివమ్ దూబే క్రీజులో ఉన్నాడు.. తోడుగా అర్ష్ దీప్ ఉన్నాడు. ఇంకేముంది టీమిండియా విజయం ఖాయం. ఆ ధీమాతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వారిద్దరూ ఉన్న వీడియో చూస్తే అర్థం అవుతోంది. 47వ ఓవర్ వరకు ఉత్సాహంగా ఉన్నారు. విజయం మనదే అనే ధీమాతో ఉన్నారు.


మలుపుతిప్పిన అసరంగ

48వ ఓవర్ అసలంక వేశాడు. అతని మాయజాలంతో భారత జట్టు రెండో వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది. 230 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆ సమయంలో మరోసారి కోహ్లి, గంభీర్ వైపు కెమెరా తిప్పగా మొహలు మాడిపోయి కనిపించాయి. వెంట్రుకవాసిలో విజయం తప్పిందనే బాధ కనిపించింది. 48 ఓవర్ మూడో బంతికి శివమ్ దూబే ఫోర్ కొట్టాడు. మరో పరుగు చేస్తే చాలు.. భారత్ జట్టు వన్డేల్లో విక్టరీ ఖాతా తెరిచేది. నాలుగో బంతికి దూబేనే అసరంగా ఎల్బీడబ్ల్యూ చేసి పంపించాడు. తర్వాత అర్ష్ దీప్‌ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి, భారత జట్టుకు అసరంగ విజయాన్ని దూరం చేశాడు.


Read Sports News and
Latest Telugu News

Updated Date - Aug 03 , 2024 | 11:54 AM

Advertising
Advertising
<