Womens T20 World Cup 2024: ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
ABN, Publish Date - May 05 , 2024 | 03:19 PM
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆదివారం రోజు మహిళల(Womens) T20 ప్రపంచ కప్ 2024(Womens T20 World Cup 2024) షెడ్యూల్‌ను(Schedule) ప్రకటించింది. తొమ్మిదో ఎడిషన్ టోర్నీ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుండగా, ఫైనల్‌తో కలిపి మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆదివారం రోజు మహిళల(Womens) T20 ప్రపంచ కప్ 2024(Womens T20 World Cup 2024) షెడ్యూల్‌ను(Schedule) ప్రకటించింది. తొమ్మిదో ఎడిషన్ టోర్నీ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుండగా, ఫైనల్‌తో కలిపి మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ట్రోఫీ కోసం 10 జట్లు ఆడనున్నాయి. ఈ క్రమంలో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్-ఏ, గ్రూప్-బీలోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్
అక్టోబర్ 4న ఈ టోర్నీలో భారత జట్టు(tema india) తన ఆటను న్యూజిలాండ్‌తో ప్రారంభించనుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఢీకొంటుంది. అక్టోబర్ 9న క్వాలిఫయర్ 1లో మూడో మ్యాచ్, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో నాలుగో మ్యాచ్‌ను టీమ్ ఇండియా ఆడాల్సి ఉంది. సిల్హెట్ మైదానంలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
T20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు
గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా (క్వాలిఫయర్ 1) ఉన్నాయి.
గ్రూప్ బీలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా (క్వాలిఫయర్ 2) కలవు
టీ20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 3: ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 3: బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ 2, ఢాకా
అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 4: ఇండియా vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 5: బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్, ఢాకా
అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 6: భారత్ vs పాకిస్థాన్, సిల్హెట్
అక్టోబర్ 7 : వెస్టిండీస్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, సిల్హెట్
అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 9 : ఇండియా vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 11: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 11: పాకిస్తాన్ vs క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 12: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 12: బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 13: పాకిస్థాన్ vs న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 13: భారత్ vs ఆస్ట్రేలియా, సిల్హెట్
అక్టోబర్ 14: ఇంగ్లాండ్ vs క్వాలిఫైయర్ 2, ఢాకా
17 అక్టోబర్: మొదటి సెమీ-ఫైనల్, సిల్హెట్
18 అక్టోబర్: రెండవ సెమీ-ఫైనల్, ఢాకా
20 అక్టోబర్: ఫైనల్, ఢాకా
ఇది కూడా చదవండి:
CSK vs PBKS: టాస్ ఓడిన చెన్నై జట్టు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Upcoming IPOs: 20 ఏళ్ల రికార్డ్ బ్రేక్..వచ్చే వారం రూ.6300 కోట్ల విలువైన ఐపీఓలు, సిద్ధమా
Read Latest Sports News and Telugu News
Updated Date - May 05 , 2024 | 03:23 PM