ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: బతికి ఉన్నందుకు సంతోషంగా ఉంది.. రిషబ్ పంత్ ప్రస్ట్రేషన్

ABN, Publish Date - Mar 21 , 2024 | 04:31 PM

రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 సీజన్‌తో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. కోలుకునేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. తిరిగి ఫిట్ అయ్యేందుకు చాలా సమయం పట్టిందని, ఆ రోజులు తాను నరక యాతన అనుభవించానని రిషబ్ పంత్ చెబుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇబ్బందిగా అనిపించిందని వివరించాడు. తాను బతికి ఉన్నందుకు మాత్రమే సంతోషించానని వైరాగ్యంతో చెప్పాడు.

మరికొన్ని గంటల్లో మహా సంగ్రామం మొదలవబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ ప్రారంభం అవనుంది. ఐపీఎల్ 2024 కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపటి నుంచి సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌తో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. కోలుకునేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. తిరిగి ఫిట్ అయ్యేందుకు చాలా సమయం పట్టిందని, ఆ రోజులు నరక యాతన అనుభవించానని రిషబ్ పంత్ (Rishabh Pant) చెబుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇబ్బందిగా ఫీలయ్యానని వివరించాడు. ఆ సమయంలో తాను బతికి ఉన్నందుకు మాత్రమే సంతోషించానని వైరాగ్యంతో సమాధానం ఇచ్చాడు.

ఫ్యాన్స్ ఖుషీ

రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. పంత్ వెల్ కం అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మెంబర్స్ త్‌కు అండగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తాడు. ఐపీఎల్ తర్వాత టీ 20 వరల్డ్ కప్ సిరీస్ ఉంది. దానికి రిషబ్ పంత్ అందుబాటులో ఉంటారు. పంత్ తిరిగి రావడంతో భారత క్రికెటర్లు హ్యాపీగా ఉన్నారు.

అదృష్టం

‘తాను బతికి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇది తనకు కలిగిన అనుభూతి. ఒకవేళ మీరు బతికి లేకుంటే.. లక్ష్యాలను ఎలా చేరుకుంటారు. బతికి ఉండటమే అదృష్టం అనుకోవాలని బంధువు ఒకరు చెప్పారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత సరిగ్గా నడువు. మైదానంలోకి వెళ్లి ఆడు. ఆటను అలా ఆస్వాదించు.. అది ముఖ్యం.. అలా వెళ్లి ఆడటం స్టార్ట్ చేస్తే ఆరోగ్యం కోలుకుంటుంది అని’ బంధువు ఒకరు చెప్పారని రిషబ్ పంత్ చెప్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

IPL 2024: రేపటి CSK vs RCB మ్యాచులో ఎవరు గెలుస్తారు.. ప్రిడిక్షన్ చుశారా?

Updated Date - Mar 21 , 2024 | 04:32 PM

Advertising
Advertising