ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Virender Sehwag: ధోనీ, కోహ్లీ, రోహిత్ ముగ్గురిలో ఎవరు బెస్ట్?.. సెహ్వాగ్ ఎవరి పేరు చెప్పాడంటే?

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:57 AM

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు.

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ముగ్గురు భారత క్రికెట్ దిగ్గజాలు. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరి నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు. మరి వీరి ముగ్గురిలో ఇష్టమైన ఆటగాడు ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఇదే ప్రశ్న టీమిండియా మాజీ దిగ్గజ ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్‌కు ఎదురైంది. భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలలో మీ ప్రాధాన్యత ఆటగాడు ఎవరు అని ప్రశ్నించగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకే సెహ్వాగ్ ఓటేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్‌ మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన సెహ్వాగ్‌ను ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. యాంకర్ అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.


ఎంఎస్ ధోనీ, బెన్ స్టోక్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ వైపే సెహ్వాగ్ మొగ్గుచూపాడు. ఇక ధోనీ కంటే దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తన ప్రాధాన్య ఆటగాడని పేర్కొన్నాడు. డివిలియర్స్-విరాట్‌లలో కోహ్లీ పేరుని చెప్పాడు. ఇక అన్నింటికంటే ఆసక్తికరంగా విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మలలో మీ ఛాయిస్ ఎవరని ప్రశ్నించగా.. టీమిండియా, టెస్ట్ కెప్టెనే బెస్ట్ అని సెహ్వాగ్ తేల్చిపడేశాడు. కాగా గత ఏడాది కాలంగా రోహిత్ శర్మ క్రేజ్, స్థాయి పెరిగాయి. వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడం, ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేయడం, ఇక ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ గెలవడంతో రోహిత్‌కు ఆదరణ పెరుగుదలకు కారణాలయ్యాయి.


అయితే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ వైదొలగిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దాదాపు ఓటమి అంచుల్లోకి వెళ్లింది.అయితే పేస్ బౌలింగ్ విభాగం అద్భుతంగా పుంజుకొని చరిత్రాత్మక విజయానికి బాటలు వేసిన విషయం తెలసిందే.

కాగా ఈ మధ్య కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్‌గా మారింది. ఏవైనా రెండు పేర్లను మాత్రమే ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకునే ఛాలెంజ్‌కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.

Updated Date - Sep 10 , 2024 | 09:58 AM

Advertising
Advertising