India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు
ABN, Publish Date - Feb 02 , 2024 | 05:55 PM
ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలిరోజు భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టాడు. జైస్వాల్ 256 బంతుల్లో 179 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
యశస్వి బేస్‌బాల్ స్టైల్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో టామ్ హార్ట్లీ వేసిన బంతిని సిక్సర్ బాదడంతో 151 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. యశస్వికి టెస్టు కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన యశస్వి టెస్టు కెరీర్‌లో 171 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Shubman Gill: పుజార వెయిట్ చేస్తున్నాడు.. గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన మాజీ కోచ్ రవిశాస్త్రి!
తన అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వి తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. 23 ఏళ్ల వయసులో స్వదేశం, విదేశాల్లో టెస్టుల్లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా ఘనతను సాధించాడు. ఇంతకు ముందు రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. 22 ఏళ్ల 36 రోజుల వయసులో యశస్వి ఈ రికార్డును సాధించడం విశేషమని చెప్పవచ్చు. ఈ క్రమంలో భారత్ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ యశస్వి, అశ్విన్(5) ఉన్నారు.
ఈ మ్యాచులో రోహిత్ (14) భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అనిపించినా.. అరంగేట్ర స్పిన్నర్ షోయబ్ బషీర్ దాటికి వెనుదిరిగాడు. తొలి సెషన్‌లో జేమ్స్ అండర్సన్ దెబ్బకు శుబ్‌మన్ గిల్ (34) రూపంలో భారత్‌కు రెండో దెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్(27), శ్రీకర్ భరత్ (17) రన్స్ చేసి ఔటయ్యారు.
Updated Date - Feb 02 , 2024 | 05:57 PM