ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడు LSG vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..డూ ఆర్ డై మ్యాచ్

ABN, Publish Date - Apr 30 , 2024 | 09:34 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 48వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ipl 2024 LSG vs MI 48th Match Win Prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 48వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాయి. మరోవైపు లక్నో(LSG)తో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్(MI) ఈ మ్యాచ్ తప్పక గెలవాలి.


లక్నో సూపర్ జెయింట్స్(LSG) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, 5 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు ముంబై ఇండియన్స్(MI) హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో మాత్రమే గెలవగలిగింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో(9) ఉంది. 10వ స్థానంలో ఆర్సీబీ జట్టు ఉంది.

ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా(google win prediction) ప్రకారం చూస్తే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 45 శాతం గెలిచే అవకాశం ఉండగా, ముంబై ఇండియన్స్‌ జట్టుకు 55 శాతం ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో లక్నో సొంత మైదానంలో ఆ జట్టుపై ముంబై జట్టు విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.


లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) ప్రాబబుల్ 11లో క్వింటన్ డి కాక్, KL రాహుల్ (wk/c), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ ఉన్నారు.

ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్రాబబుల్ 11లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా కలరు.


ఇది కూడా చదవండి:

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందా? అందుకు ఏం చేయాలి?

IPL 2024: చరిత్ర సృష్టించిన ఫిల్ సాల్ట్.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలు


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 09:38 AM

Advertising
Advertising