ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే

ABN, Publish Date - Mar 30 , 2024 | 07:52 AM

ఐపీఎల్ 2024లో ఈరోజు 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ శనివారం ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన లక్నో ఈ మ్యాచులో తొలి విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు పంజాబ్ చివరి మ్యాచ్‌ RCB చేతిలో ఓడిన జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 11వ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), పంజాబ్ కింగ్స్‌(Punjab Kings) జట్ల మధ్య లక్నో(Lucknow)లోని ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన లక్నో కేఎల్ రాహుల్(Kl rahul) నేతృత్వంలో ఈ మ్యాచులో తొలి విజయం సాధించాలని చూస్తున్నారు. లక్నో 194 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయంతో ప్రారంభించారు. కానీ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)పై 176 పరుగులను డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ శిఖర్ ధావన్(shikhar dhawan) ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు.


పాయింట్ల పట్టికలో చివరి స్థానం(10)లో ఉన్న లక్నో జట్టు(LSG) ఈరోజు ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్(PBKS) జట్టుతో తలపడనుంది. లక్నో, పంజాబ్ జట్లలో ఈ ఫార్మాట్‌లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ మైదానంలో పరుగులు ఎక్కువగా చేయడం కష్టమేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు గూగుల్ గెలుపు అంచనా ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, పంజాబ్ కింగ్స్‌ జట్టుకు 46 శాతం ఉందని తెలిపింది. అయితే ఇది ప్రకటించినట్లుగా అలాగే జరుగుతుందని చెప్పలేం.

LSG ప్రాబబుల్ ప్లేయింగ్: KL రాహుల్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్ ఉన్నారు.

PBKS ప్రాబబుల్ ప్లేయింగ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్ కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కోల్‌కతా టాప్‌షో

Updated Date - Mar 30 , 2024 | 07:58 AM

Advertising
Advertising