ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: రోహిత్ శర్మ ఔట్.. సంబరాలు చేసుకున్న వ్యక్తిని కొట్టి చంపిన అభిమానులు

ABN, Publish Date - Apr 01 , 2024 | 10:35 AM

ఐపీఎల్(ipl 2024) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లలో పలు జట్లలోని ఆటగాళ్లను అభిమానించే వాళ్లు అనేక మంది ఉంటారు. అంతేకాదు వారికి నచ్చిన ఆటగాళ్ల మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా ఆ జట్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే తట్టుకోలేరు. ఈ క్రమంలోనే ఇటివల సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) vs ముంబై ఇండియన్స్(mumbai indians) మ్యాచ్‌ సందర్భంగా ఓ అభిమానిని మరో ఇద్దరు అభిమానలు కలిసి కొట్టి చంపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

ఐపీఎల్(ipl 2024) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లలో పలు జట్లలోని ఆటగాళ్లను అభిమానించే వాళ్లు అనేక మంది ఉంటారు. అంతేకాదు వారికి నచ్చిన ఆటగాళ్ల మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా ఆ జట్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే తట్టుకోలేరు. ఆ క్రమంలోనే గతంలో కూడా స్టేడియంలో అభిమానుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఇటివల సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) vs ముంబై ఇండియన్స్(mumbai indians) మ్యాచ్‌ సందర్భంగా ఓ అభిమానిని మరో ఇద్దరు అభిమానలు కలిసి కొట్టి చంపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: MS Dhoni: విశాఖలో ధోనీ విధ్వంసం.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ ఎలా కొట్టాడో చూడండి..!


గత బుధవారం ముంబై ఇండియన్స్(MI), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఇందులో హైదరాబాద్ IPL చరిత్రలో 3 వికెట్లకు 277 పరుగుల అత్యధిక స్కోరు చేసి, ముంబైపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్రలో ఇద్దరు అభిమానుల మధ్య జరిగిన గొడవ కాస్తా పెరిగి పెరిగి చంపుకునే స్థాయికి చేరింది. అయితే మ్యాచ్ జరిగిన క్రమంలో 63 ఏళ్ల బండోపంత్ టిబిలే, 50 ఏళ్ల బల్వంత్ ఝంజ్‌గే ఓ స్నేహితుని ఇంట్లో ఈ మ్యాచ్‌ని చుశారు.

ఆ క్రమంలోనే మ్యాచ్ సమయంలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ(rohit sharma) ఔట్ అయ్యాడు. అప్పుడు వెంటనే CSK అభిమాని టిబిల్(Bandopant Bapuso Tibile) రోహిత్ అవుట్ అయ్యాడని వ్యాఖ్యలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీంతో అది తట్టుకోలేని ఝంజ్‌గే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఝంజ్‌గే అక్కడి నుంచి వెళ్లి తన బంధువు సాగర్‌ని కూడా తీసుకొచ్చి టిబిల్‌ను తీవ్రంగా కొట్టాడు(attack).

దీంతో గాయపడిన టిబిల్‌ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ శనివారం టిబిల్ చికిత్స పొందుతున్న క్రమంలోనే మృత్యువాత చెందాడు. ఈ ఘటన నేపథ్యంలో నిందితులిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు(police) వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్ర(maharashtra)లోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank holidays in April 2024: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. పనిచేసేది కేవలం..

Updated Date - Apr 01 , 2024 | 10:42 AM

Advertising
Advertising