ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: నేటి SRH vs LSG మ్యాచులో ఎవరు గెలుస్తారు..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN, Publish Date - May 08 , 2024 | 10:21 AM

ఐపీఎల్ 2024లో నేడు 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌ వెళ్లేందుకు రెండు జట్లకు మరింత ఛాన్స్ ఉంటుంది.

ipl 2024 SRH vs LSG 57th match win prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌ వెళ్లేందుకు రెండు జట్లకు మరింత ఛాన్స్ ఉంటుంది. దీంతో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లూ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది, పిచ్ ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.


హైదరాబాద్(hyderabad) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానం చిన్నదిగా ఉన్న కారణంగా ఫోర్లు, సిక్సర్లు ఎక్కువగా వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు కూడా ఈ మైదానంలో 277 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నేటి మ్యాచ్‌లో భారీ స్కోరు రావచ్చని క్రీడా వర్గాలు భావిస్తున్నారు. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే నేటి మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు 46 శాతం ఛాన్స్ ఉంది.


పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ గత కొన్ని మ్యాచ్‌ల్లో విజయాల జోరు ఆగిపోయింది. సన్‌రైజర్స్(SRH) తమ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకపోవడంతో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తమ బ్యాట్స్‌మెన్స్ పేలవ ప్రదర్శన నుంచి కోలుకుని సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌(LSG)తో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచులు గెలిచిన లక్నో ఈ మ్యాచ్ కూడా గెలవాలని భావిస్తోంది. 11 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లకు 12 పాయింట్లు ఉన్నాయి. లక్నో (మైనస్ 0.371) కంటే సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ (మైనస్ 0.065) మెరుగ్గా ఉంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రాబబుల్ 11లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్ ఉన్నారు.

లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) జట్టు ప్రాబబుల్ 11లో కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మొహ్సిన్ ఖాన్ కలరు.


ఇది కూడా చదవండి:

ఢిల్లీ అదుర్స్‌

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి

Read Latest Sports News and Telugu News

Updated Date - May 08 , 2024 | 10:25 AM

Advertising
Advertising