Virat Kohli: మీడియాకు కోహ్లీ వార్నింగ్.. ఏం అనుకుంటున్నారంటూ..
ABN, Publish Date - Dec 19 , 2024 | 03:40 PM
కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసలు ఏం జరిగింది. ఎందుకు విరాట్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎప్పుడూ కూల్‌గా ఉండే ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ఆ క్రమంలో మీడియాపై ఫైర్ అయ్యారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. విరాట్ ఫ్యామిలీతోపాటు మెల్‌బోర్న్ విమానాశ్రయం చేరుకున్న క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా టీవీ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఓ మహిళా జర్నలిస్టు విరాట్ ఫ్యామిలీ చిత్రాలను తీయాలనే విషయంలో మహిళా జర్నలిస్టుతో విరాట్ వాదనకు దిగాడు. విరాట్ భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా కోహ్లీ, అకాయ్ కోహ్లీతో కలిసి మెల్‌బోర్న్ విమానాశ్రయంలో దిగారు.
విరాట్ క్లారిటీ
ఆ క్రమంలో ఆస్ట్రేలియా మీడియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు తన ఫ్యామిలీ చిత్రాలు, వీడియోను తీయాలని చూడటంతో సహనం కోల్పోయిన విరాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమకు కూడా కొంచెం ప్రైవసీ కావాలని కోరాడు. తనని అడగకుండా మీరు ఎలా తన ఫ్యామిలీ చిత్రాలు, వీడియోలను తీస్తారని విరాట్ ప్రశ్నించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ 26న ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టుకు ముందు మెల్‌బోర్న్‌లో చేరుకున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఫోటోగ్రాఫ్‌లు తీయడంపై
అయితే విరాట్ తన పర్మిషన్ లేకుండా షూట్ చేసిన ఫ్యామిలీ చిత్రాలను తొలగించాలని ఆ మహిళా జర్నలిస్టును కోరాడు. కానీ ఆ జర్నలిస్టు మాత్రం కోహ్లీ మాట వినలేదు. ఆ విషయమై ఈ మహిళా జర్నలిస్టుతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. తన పర్మిషన్ లేకుండా ఎలా తీస్తారని ఆమెను ప్రశ్నించాడు. కానీ ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశంలో ఎవరైనా ప్రముఖుల వీడియోలు లేదా ఫోటోగ్రాఫ్‌లు తీయడంపై ఎలాంటి పరిమితి లేదు.
విరాట్ ప్రదర్శన
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన గురించి మాట్లాడితే, బ్రిస్బేన్ టెస్టులో 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అడిలైడ్ టెస్టులో విరాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 7, 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 100 పరుగులు చేశాడు. ఈ విధంగా కోహ్లి మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 31.50 సగటుతో 126 పరుగులు మాత్రమే చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి జరగనుంది.
ఇవి కూడా చదవండి:
Spherical Egg: ఒక కోడి గుడ్డు ధర రూ. 21 వేలు.. స్పెషల్ ఏంటో తెలుసా..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 19 , 2024 | 03:56 PM