T20 Match: మిరాకిల్.. 9 వికెట్లు పడగొట్టాడు..
ABN, Publish Date - Aug 25 , 2024 | 12:39 PM
Maharaja T20 Trophy: మహారాజా టీ20 ట్రోఫీలో బౌలర్ అభిషేక్ ప్రభాకర్ అదరగొట్టాడు. ఏకంగా 9 వికెట్లు పడగొట్టి తన టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ అద్భుత ప్రదర్శనతో గుర్బర్గ్ టీమ్ మహారాజా టీ20 ట్రోఫీలో 4 మ్యాచ్‌లు గెలిచింది.
Maharaja T20 Trophy: మనోజ్ ప్రభాకర్ 90వ దశకంలో టీమిండియా స్ట్రైక్ బౌలర్. ఇప్పుడు భారత క్రికెట్‌లోకి మరో ప్రభాకర్ అడుగపెట్టాడు. మహారాజా టీ20 ట్రోఫీలో 25 ఏళ్ల అభిషేక్ ప్రభాకర్ 9 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. తన టీమ్‌కి హీరోగా నిలిచాడు. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా టీమ్ వరుస విజయాలను నమోదు చేసింది. మహారాజా టీ20 ట్రోఫీలో అభిషేక్ ప్రభాకర్ 75 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు.
4 రోజుల్లో 3 మ్యాచ్‌లు, 9 వికెట్లు..
20 ఓవర్ల T20 మ్యాచ్‌లో.. ప్రతి బౌలర్‌కు వారి కోటాలో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ ప్రభాకర్ 9 వికెట్లు తీయడం ఎలా సాధ్యమైంది? అని ఆలోచిస్తున్నారు. అభిషేక్ ప్రభాకర్ ఒక మ్యాచ్‌లోనే ఈ మొత్తం వికెట్లు పడగొట్టలేదు. 4 రోజుల్లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి తన కెరీర్‌లో రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ఆగస్టు 24 సాయంత్రం మైసూరు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ ప్రభాకర్ ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.
మైసూరు వారియర్స్ షాక్: 21 పరుగులకు 5 వికెట్లు..
అభిషేక్ ప్రభాకర్ విధ్వంసకర బౌలింగ్‌కు మైసూర్ వారియర్స్ టీమ్ విలవిల్లాడింది. 5 వికెట్ల తేడాతో గుల్బర్గ్ టీమ్ జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అభిషేక్ ఒక్కడే 5 వికెట్లు తీశాడు. ఇక తరువాత ఛేజింగ్‌కు దిగిన గుల్బర్గ్ టీమ్.. 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయం సాధించింది.
Also Read:
ముష్ఫికర్ భారీ శతకం
అమ్మో..అది ఎంత భయపెట్టిందో!
జోర్డాన్‌లో చిక్కుకుపోయిన మహిళా రెజ్లర్లు
For More Cricket News and Telugu News..
Updated Date - Aug 25 , 2024 | 12:39 PM