Olympic Games Paris 2024: ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో గందరగోళం.. పడవ ఎక్కకుండా క్రీడాకారులను అడ్డుకున్న అధికారులు..
ABN, Publish Date - Jul 27 , 2024 | 08:41 AM
పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. మైదానం వెలుపల ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరగడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో పలువురు తారలు పాల్గొన్నారు. అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా, ఆయ నకాముర వంటి సూప ర్ స్టార్ సింగర్లు వేడుకల్లో పాల్గొన్నారు. సెయిన్ నదిపై 6 కిలోమీటర్ల మేర జరిగిన పొడవైన పరేడ్ ఆఫ్ నేషన్స్‌లో 206 దేశాల నుండి 6500 మందికి పైగా అథ్లెట్లు 94 బోట్లలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లను పడవ ఎక్కకుండా అడ్డుకోవడం స్వల్ప వివాదానికి దారితీసింది.
Olympic Games : ఆరంభ సంబరం పారిస్ పరవశం
ఆ జట్టుకు నిరాశ..
ఒలింపిక్ క్రీడల కవాతులో గ్రీకు బృందం మొదటి స్థానంలో నిలవగా.. ఆతిథ్య దేశం ప్రాన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఈ సమయంలో నైజీరియా మహిళల బాస్కెట్‌బాల్ జట్టును పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కోసం డెలిగేషన్ బోట్‌లో ఎక్కడానికి అనుమతించలేదు. నైజిరీయా అధికారులే ఆ జట్టు క్రీడాకారులను అడ్డుకున్నారు. దీనకి సంబంధించిన కారణం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బోట్‌లో చాలా మంది క్రీడాకారులు ఉన్నందున, నైజీరియా మహిళల బాస్కెట్‌బాల్ జట్టుతో పాటు టీమ్ కోచ్‌ను బోట్‌లోకి ఎక్కనీయలేదని తెలిసింది. దీంతో నైజిరీయా మహిళల బాస్కెట్ బాల్ జట్టు తిరిగి అథ్లెట్స్ విలేజ్‌కు వెళ్లాల్సి వచ్చింది.
T20 World Champion : కొత్త.. కొత్తగా
ప్రారంభోత్సవ వేడుక ఎంతో ప్రత్యేకం..
1896లో జరిగిన మొదటి ఒలింపిక్స్ నుండి 2020 వరకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు స్టేడియంలోనే జరిగాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ వేడుకలు పారిస్ నగరం మధ్యలో ఉన్న ప్రసిద్ధ సెయిన్ నది నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఈ వేడుకలను చారిత్రాత్మకమైనవిగా పేర్కొంటున్నారు. ఈ సమయంలో క్రీడాభిమానులు నదికి ఇరువైపులా కూర్చుని వేడుకలను వీక్షించారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రారంభ వేడుకగా కూడా చెబుతున్నారు. 206 దేశాల నుండి మొత్తం 10,714 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారిస్ విశ్వ క్రీడల్లో అత్యధిక అథ్లెట్లు పోటీపడుతున్న దేశంగా అమెరికా నిలిచింది. ఈ దేశం నుంచి 594 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో 572 మంది అథ్లెట్లతో ఫ్రాన్స్ వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా నుంచి 460 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.
వేలంలో ద్రవిడ్ కొడుక్కి రూ.50 వేలు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News
Updated Date - Jul 27 , 2024 | 08:41 AM