PV Sindhu: ఈరోజే పీవీ సింధు పెళ్లి.. తన ఆస్తి ఎంతో తెలుసా..
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:27 PM
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈరోజు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వ్యాపారవేత్త వెంకట్ దత్తా సాయితో సింధు ఏడడుగులు వేశారు. అయితే సింధు పెళ్లి సందర్భంగా తన ఆస్తి విశేషాలను ఇక్కడ చూద్దాం.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) ఈరోజు (డిసెంబర్ 22న) ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన రిసార్ట్ రాఫెల్స్‌లో తన కాబోయే భర్త వెంకట దత్త సాయితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో డిసెంబర్ 24న సింధు స్వస్థలం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. అయితే సింధు తన ఆటతోపాటు ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడంతో అపారమైన సంపదను కూడా దక్కించుకున్నారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనిక బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో పీవీ సింధు ఒకరిగా నిలిచారు. ఆయితే ప్రస్తుతం పీవీ సింధు వివాహం సందర్భంగా ఆమె సంపద గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నికర విలువ ఎంతో తెలుసా..
29 ఏళ్ల పీవీ సింధు హైదరాబాద్‌లో జన్మించింది. జూలై 5, 1995న హైదరాబాద్‌లో జన్మించిన పీవీ సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించిన పీవీ సింధు.. ఇప్పటి వరకు కెరీర్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించింది. మీడియా కథనాల ప్రకారం పీవీ సింధు మొత్తం నికర విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు. ఆమె భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరిగా ఉన్నారు.
లగ్జరీ కార్ల యజమాని
దీంతోపాటు సింధుకు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఆమెకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కారు బహుమతిగా ఇచ్చారు. ఇది కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇచ్చారు. సింధు వద్ద బీఎమ్‌డబ్ల్యూ వంటి బ్రాండ్‌ల కార్లు కూడా ఉన్నాయి.
అత్యంత ధనిక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా
బ్యాడ్మింటన్ ఆడటంతో పాటు పీవీ సింధు ఆదాయ వనరు బ్రాండ్ ఎండార్స్‌మెంట్. ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్, మేబెల్‌లైన్ వంటి బ్రాండ్‌లకు ప్రకటనలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ కావడం విశేషం. 2019 సంవత్సరంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని 15 మంది ధనిక మహిళా క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ఏకైక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు. ఆ తర్వాత భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక బ్యాడ్మింటన్ స్టార్‌గా అవతరించింది. అప్పుడు ఆమె నికర ఆస్తి విలువ రూ.38.9 కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో
Read More Business News and Latest Telugu News