Ravichandran Ashwin: చారిత్రాత్మక సెంచరీ గురించి సిక్రెట్ చెప్పిన అశ్విన్.. ధోని రికార్డును
ABN, Publish Date - Sep 20 , 2024 | 08:15 AM
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మొదటి టెస్టులో తన ఆరవ సెంచరీని సాధించిన తర్వాత, స్టార్ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రిషబ్ పంత్ లాగా బ్యాటింగ్ చేయడం మంచిదన్నాడు. దీంతోపాటు స్టేడియం పిచ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు భారత్(team india) 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఈ క్రమంలో టీమిండియా ఒక్కసారిగా 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. అయితే వీరిద్దరూ 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. చెన్నై గడ్డపై అతనికిది రెండో సెంచరీ. దీంతో అశ్విన్ సెంచరీని అందరూ కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే అశ్విన్(Ravichandran Ashwin) తన సెంచరీ గురించి కీలక విషయాన్ని వెల్లడించాడు.
పిచ్ ఎలా ఉందంటే
తొలిరోజు ఆట ముగిసిన తర్వాత మాట్లాడిన అశ్విన్ ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ పాత కాలం నాటిదని పేర్కొన్నాడు. ఇక్కడ బౌన్స్, రెడ్ క్లే పిచ్ కొన్ని షాట్లు ఆడేందుకు మాత్రమే అనుమతిస్తుందని, దానిని ఆస్వాదించానన్నారు. ఇందులో ఫాస్ట్ బౌలర్లకు సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి పిచ్‌పై కొన్నిసార్లు రిషబ్ పంత్ లాగా బ్యాటింగ్ చేయడం మంచిదని పేర్కొన్నాడు. ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా తనకు ఎంతగానో సహకరించాడని చెప్పాడు. జడేజాపై ప్రశంసలు కురిపించిన అశ్విన్.. గత కొన్నేళ్లుగా టీమిండియా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో జడేజా ఒకరని పేర్కొన్నాడు.
ధోని స్థాయికి
ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ కూడా టెస్టు క్రికెట్‌లో మొత్తం 6 సెంచరీలు సాధించగా, ఇప్పుడు అశ్విన్ కూడా ధోని స్థాయికి చేరుకున్నాడు. రవిచంద్రన్ ఇప్పుడు టెస్టుల్లో ఎనిమిదో ర్యాంక్‌కు చేరాడు. బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ నంబర్ వన్. అతను ఎనిమిదో స్థానంలో లేదా ఆ తర్వాత మొత్తం 5 సెంచరీలు సాధించగా, అశ్విన్ ఇప్పుడు రెండో స్థానానికి అధిగమించాడు. పాక్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ మూడుసార్లు ఈ ఫీట్ చేయగా, వెస్టిండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్ కూడా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్ 112 బంతుల్లో 91.07 స్ట్రైక్ రేట్‌తో 102 పరుగులు చేసి క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. క్రీజులో ఉన్న సమయంలో 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
ప్రస్తుతం
భారత్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో జట్టు 34/3తో కష్టాల్లో పడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (118 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 56 పరుగులు), రిషబ్ పంత్ (52 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 39 పరుగులు) నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత్ 144/6తో కుప్పకూలింది. అశ్విన్, జడేజా (117 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 86) అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 339/6.
ఇవి కూడా చదవండి:
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read LatestSports News andTeluguNews
Updated Date - Sep 20 , 2024 | 08:20 AM