ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బస్ డ్రైవర్‌గా మారిన రోహిత్ శర్మ

ABN, Publish Date - Apr 14 , 2024 | 09:34 AM

ఐపీఎల్ 2024(ipl 2024)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్లు ఆదివారం రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ముంబై(mumbai)లోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Rohit Sharma Turns Bus Driver

ఐపీఎల్ 2024(ipl 2024)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) జట్లు ఆదివారం రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. ముంబై(mumbai)లోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma)కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టు ఉన్న బస్సును నడుపుతున్నట్లు కనిపించారు. వీడియోలో బస్సు ముందు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండగా, రోహిత్ శర్మ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్లుగా ఫోజులిచ్చారు.


ఇందులో ముంబై ఇండియన్స్ టీమ్ బస్సు మైదానానికి బయలుదేరుతోంది. జట్టులోని ఆటగాళ్లు, సిబ్బంది బస్సులో ఉన్నారు. రోహిత్ శర్మ వచ్చి డ్రైవర్ సీటు(driver seat)లో కూర్చున్నాడు. ఆ క్రమంలో వీడియోలో రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ ఇతర ఆటగాళ్లు కూడా కనిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కోడుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును(RCB) ఓడించి ముంబై ఇండియన్స్(MI) ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. అయితే ఈ జట్టు ఆరంభంలో దారుణంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

అయితే దీని తర్వాత హార్దిక్ పాండ్యా జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. అయితే, ఇప్పుడు ముంబై ఇండియన్స్(MI) నేటి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో ఆడనుంది.


ఇది కూడా చదవండి:

గట్టెక్కిన రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌లో విజయం


6 బంతుల్లో.. 6 సిక్స్‌లు


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 09:37 AM

Advertising
Advertising