ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IPL: ఎల్ఎస్‌జీ బంపర్ ఆఫర్.. హిట్‌మ్యాన్ ఏమన్నారంటే..

ABN, Publish Date - Aug 29 , 2024 | 09:26 AM

రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Rohit Sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025 గురించి అప్పుడే చర్చ జరుగుతోంది. ఏ జట్టులో ఓ బ్యాట్స్ మెన్ ఉంటారు. ఏ బౌలర్ ఉంటారు. టీమ్‌కు కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే డిస్కషన్ జరుగుతోంది. గత సీజన్‌లో ముంబై జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం కీలక పరిణామం. ఆ సమయంలో రోహిత్ శర్మ అభిమానులు కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేశారు. నెక్ట్స్ ఇయర్ ముంబైకి ఆడొద్దని సూచిస్తున్నారు. అదలా ఉండగానే రోహిత్ ముంబై జట్టు తరఫున ఆడరని, మరో జట్టుకు వెళతారనే ప్రచారం జరుగుతోంది.



లక్నోకు..

రోహిత్ శర్మ పంజాబ్ జట్టు తరఫున ఆడతారనే ఊహాగానాలు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడతారని ప్రచారం జరుగుతోంది. మరో అడుకు ముందుకేసి రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు లక్నో జట్టు రూ.50 కోట్లు కేటాయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని స్పోర్ట్స్ టాక్‌లో యాంకర్ ఎల్‌ఎస్‌జీ ఓనర్ హర్ష గోయెంకాను ప్రశ్నించారు. అందుకు గోయెంకా తెలివిగా సమాధానం ఇచ్చారు.



వేలానికి వస్తున్నాడా..

‘మీరు చెప్పండి.. రోహిత్ శర్మ, లేదంటే ఇతరులు వేలానికి వస్తున్నారో లేదో.. మీకు తెలుసా.. ఏ కారణం లేకుండానే ఊహాగానాలు వస్తున్నాయి. అసలు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను వదులకుంటుందా.. రోహిత్ శర్మ పేరు వేలంలో ఉంటుందా.. ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే.. అతని కోసం రూ.50 కోట్లు వెచ్చించొచ్చా.. మరి మిగిలిన ఆటగాళ్ల సంగతి ఎలా అని’ యాంకర్‌ను ఎదురు ప్రశ్నించారు.



మీ జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని అనుకుంటున్నారా..? అని యాంకర్ మరో ప్రశ్న వేశారు.

అదేం లేదు..

‘ఆ ప్రశ్నకు గోయెంకా సూటిగా సమాధానం చెప్పలేదు. జట్టులోకి బెస్ట్ ప్లేయర్‌ను తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచి ఆటగాడు కావాలి, మంచి కెప్టెన్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మనం కోరుకోవడం కాదు.. మనకు అందులో ఉన్నది ఏదనేది ముఖ్యం. ఉన్న దాంతో సంతృప్తి పరచుకోవాలి. ఇదే విషయం నేను కోరుకుంటాను. నేను కాదు ప్రతి ఫ్రాంచైజీ ఓనర్ ఇలానే భావిస్తారు. అన్ని కావాలంటే ఎవరు పొందలేరు అని’ గోయెంకా స్పష్టం చేశారు. జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని గోయెంకా పరోక్షంగా కోరుకుంటున్నారు. పైకి మాత్రం ఇలా మాట్లాడుతున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Aug 29 , 2024 | 09:26 AM

Advertising
Advertising