ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎంఎస్ ధోని పాదాలకు మొక్కిన సాక్షి సింగ్

ABN, Publish Date - Jul 07 , 2024 | 09:59 AM

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.

Sakshi Singh touches MS Dhonis feet

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. ఇది చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి. అయితే ధోని బర్త్ డే సందర్భంగా ఈ అరుదైన దృశ్యం వెలుగులోకి వచ్చింది.


శనివారం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకకు ధోనీ, ఆయన భార్య సాక్షి హాజరయ్యారు. ఆ క్రమంలో మహి తన 43వ పుట్టినరోజును (MS ధోని పుట్టినరోజు వేడుక) సల్మాన్ ఖాన్‌తో కలిసి హోటల్లో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ధోనీ అర్ధరాత్రి పుట్టినరోజు జరుపుకోగా, ఆ క్రమంలో ఆయన భార్య సాక్షి వినూత్నంగా విష్ చేస్తూ ధోని పాదాలను తాకి నమస్కరించగా, ధోనీ సాక్షిని ఆశీర్వదించడం కనిపించింది. అర్ధరాత్రి మహి పుట్టినరోజును జరుపుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(salman khan) కూడా ధోనీ పుట్టినరోజు హాజరైన క్రమంలో శుభాకాంక్షలు తెలియజేశారు. 'హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


జూలై 7, 1983లో జన్మించిన ధోని(MS Dhoni) 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్నాడు. ధోనీ కెప్టెన్సీలో ఇప్పటివరకు CSK ఐదు IPL టైటిళ్లను గెలుచుకుంది. ధోనీ తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. కానీ అతను తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాత్రం ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా చాలా ముంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా, మహీ అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఎంఎస్ ధోనీకి కార్లు, బైక్‌లంటే చాలా ఇష్టం.


ఇది కూడా చదవండి:


స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత వినేశ్‌

Hardik Pandya: నీతా అంబానీ తీవ్ర భావోద్వేగం


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 10:21 AM

Advertising
Advertising
<