IND vs SL: నేడు ఇండియా vs శ్రీలంక టీ20 సిరీస్ మ్యాచ్.. ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉంది
ABN, Publish Date - Jul 27 , 2024 | 07:57 AM
టీ20 ప్రపంచ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్‌లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
టీ20 ప్రపంచ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్‌లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. భారత పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్(gautam gambhir)కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. కాగా శ్రీలంక పర్యటనకు భారత టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను(surya kumar yadav) నియమించారు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ను 4-1 తేడాతో గెలిపించడంతో పాండ్యాను కాదని సూర్యవైపే ఆసక్తి చూపించారు.
రెండుసార్లు
అతి తక్కువ ఫార్మాట్‌లో 68 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్(surya kumar yadav) ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాడు. భారత క్రికెట్ జట్టును జింబాబ్వేపై సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత, ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచ మాజీ నంబర్1 టీ20 ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఈ నెల ప్రారంభంలో జరిగిన IND vs ZIM సిరీస్‌కు దూరమైన తర్వాత తిరిగి వస్తున్నారు. T20 క్రికెట్ ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తర్వాత మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఆడనున్నారు.
గెలుపు అంచనా
మరోవైపు శ్రీలంక(Sri Lanka) కూడా కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. జూన్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ తర్వాత వనిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన క్రమంలో ఈ సిరీస్‌లో చరిత్ అసలంక ఆతిథ్య జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు T20 మ్యాచ్‌లలో అసలంక శ్రీలంకకు నాయకత్వం వహించాడు. అక్కడ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి మరొక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారకు వేలి విరిగిపోగా, తోటి ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా బ్రాంకైటిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్నాండోలను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే టీమిండియా గెలిచేందుకు 71 శాతం ఛాన్స్ ఉండగా, శ్రీలంకకు 29 శాతం అవకాశం ఉంది.
భారత్ vs శ్రీలంక T20 2024 షెడ్యూల్
జులై 27, శనివారం: భారత్ vs శ్రీలంక 1వ T20 - 7:00 PM
జులై 28, ఆదివారం: భారత్ vs శ్రీలంక 2వ T20 - 7:00 PM
జులై 30, మంగళవారం: భారత్ vs శ్రీలంక 3వ T20 - 7:00 PM
IND vs SL T20 క్రికెట్ 2024 జట్లు
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), దినేష్ చండిమాల్ (WK), అసిథిత ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, వనిందు హసరంగా, దిల్షాన్ మధుశంక, కుసల్ మెండిస్ (WK), కమిందు మెండిస్, పాతుమ్ నిస్సాంక, మతిషా పతిరనా (కుసల్ పర్క్సల్) , దాసున్ షనక, మహిష్ తీక్షణ, దునిత్ వెల్లాగే, చమిందు విక్రమసింఘే.
ఇవి కూడా చదవండి:
Olympic Games : ఆరంభ సంబరం పారిస్ పరవశం’
Asia Cup : మన ప్రత్యర్థి మళ్లీ శ్రీలంకే
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 27 , 2024 | 07:59 AM