ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?

ABN, Publish Date - Jun 27 , 2024 | 09:36 AM

నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.

India vs England Guyana match

నేడు గురువారం (జూన్ 27, 2024) టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024)లో ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య కీలకమైన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గయానా(Guyana)లోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానుంది. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇరు జట్లు వరుసగా రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు 2022 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో నేడు రోహిత్ సారథ్యంలోని టీమ్ ఇండియా మళ్లీ ఇంగ్లండ్ జట్టుపై రివేంజ్ తీసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. అయితే పిచ్ ఎలా ఉంది, ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


పిచ్ ఎలా ఉంది

గయానాలో ఈ మ్యాచ్ జరగనుంది. గయానాలో కొంతకాలంగా వర్షాలు కురుస్తున్నందున పిచ్‌(pitch report)లో తేమ ఉండే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు మంచి సపోర్ట్ లభించనుంది. ఫాస్ట్ బౌలర్లే కాకుండా స్పిన్నర్లు కూడా ఇక్కడి పిచ్‌పై మ్యాజిక్‌ను ప్రదర్శించనున్నారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 127 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 95 పరుగులు. ఈ మైదానంలో మొత్తం 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 16 సార్లు గెలుపొందగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 14 సార్లు విజయం సాధించింది.


హెడ్ టూ హెడ్

ఇక ప్రస్తుత సీజన్‌లో సూపర్ 8 మ్యాచ్‌లలో రెండు జట్ల ప్రదర్శనను(head to head) చూస్తే టీం ఇండియా(team india) హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్‌లలో 2 గెలిచి, ఒక మ్యాచ్ ఓడిపోతుంది. దీంతో గ్రూప్ పాయింట్ల పట్టికలో భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో భారత్, ఇంగ్లండ్(england) మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. టీం ఇండియా 12 మ్యాచ్‌లు గెలువగా, ఇంగ్లండ్ జట్టు 11 మ్యాచ్‌లు గెలిచింది. ఇరు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ జట్టు రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నవంబర్ 10, 2022 తర్వాత మళ్లీ ఈ జట్లు తలపడుతుండటం విశేషం.


గెలుపు ఛాన్స్

టీమ్ ఇండియా, టీమ్ ఇంగ్లండ్ జట్లు తలపడినప్పుడల్లా మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇంగ్లండ్‌పై టీమిండియా విజయాల శాతం(winning chance) ఎక్కువగా ఉందని గూగుల్ పేర్కొంది. టీమ్ ఇండియా విజయాల శాతం 58% కాగా, ఇంగ్లండ్ జట్టుకు 42% ఉంది.

ఇండియా(team india) ప్రాబబుల్ XIలో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

ఇంగ్లండ్(england) ప్రాబబుల్ XIలో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ కలరు.


ఇవి కూడా చదవండి:

నాకౌట్‌కు ఇంగ్లండ్‌

జర్మనీలో నిఖత్‌ శిక్షణ


ఆగని రికార్డుల హోరు

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 09:45 AM

Advertising
Advertising