ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: ఇంగ్లండ్ రికార్డు చిత్తు చేసిన భారత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఘనత

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:23 PM

కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అదిరిపోయేలా బ్యాటింగ్‌ చేస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా అరుదైన రికార్డులు సాధించింది.

team india broke Englands record

కాన్పూర్ వేదికగా టీమిండియా(team india)-బంగ్లాదేశ్(bangladesh) జట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా మూడు రోజుల పాటు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడిన తర్వాత, బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆటను పునఃప్రారంభించి కొనసాగిస్తుంది. గ్రీన్ పార్క్‌ స్టేడియంలో 233 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌లు శుభారంభం అందించారు. ఆ క్రమంలో జైస్వాల్ 51 బంతుల్లో 71 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 రన్స్ చేసి ఔటయ్యారు.


ప్రపంచ రికార్డు

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై కాన్పూర్‌ స్టేడియంలో వీరిద్దరూ కలిసి మూడు ఇన్నింగ్స్‌ల్లో 50 పరుగుల మార్కును అధిగమించారు. కానీ మూడు ఓవర్లలోనే ఈ ఫీట్ సాధించడం ద్వారా భారత్ ఇంగ్లండ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 4.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. దీంతో రోహిత్ శర్మ, జైస్వాల్ ఇంగ్లండ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడంలో భారత్‌కు సహకరించారు. దీనికి ముందు ఇంగ్లండ్ 1994లో దక్షిణాఫ్రికాపై 4.3 ఓవర్లలో 50 పరుగులు చేసింది. 2002లో శ్రీలంకపై 5 ఓవర్లలో ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది.


టెస్టు క్రికెట్‌ చరిత్రలో వేగవంతమైన 50లు

  • 3.0 ఓవర్లు - భారతదేశం vs బంగ్లాదేశ్, కాన్పూర్, 2024

  • 4.2 ఓవర్లు - ఇంగ్లాండ్ vs వెస్టిండీస్‌, నాటింగ్‌హామ్, 2024

  • 4.3 ఓవర్లు - ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, ది ఓవల్, 1994

  • 4.6 ఓవర్లు - ఇంగ్లాండ్ vs శ్రీలంక, మాంచెస్టర్, 2002

  • 5.2 ఓవర్లు - శ్రీలంక vs పాకిస్తాన్, కరాచీ, 2004

  • 5.3 ఓవర్లు - భారతదేశం vs ఇంగ్లండ్, చెన్నై, 2008

  • 5.3 ఓవర్లు - భారత్ vs వెస్టిండీస్‌, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2023


జైస్వాల్ మరో రికార్డ్

మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. యశస్వి 31 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇప్పుడు టెస్టుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారత్‌ నుంచి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. దీంతోపాటు టీమిండియా టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని కూడా నమోదు చేసింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో భారత్ బ్యాటింగ్ చేసి కేవలం 61 బంతుల్లోనే సెంచరీ సాధించింది. టెస్టు క్రికెట్‌లో ఏ ఇన్నింగ్స్‌లోనైనా జట్టు చేసిన వేగవంతమైన 100 పరుగులు ఇవే. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు భారత్ పేరిట ఉండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు


Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Sep 30 , 2024 | 04:33 PM