Team India: అదరగొట్టిన అశ్విన్.. బంగ్లాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
ABN, Publish Date - Sep 22 , 2024 | 11:44 AM
చెన్నై టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టడంతో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌పై ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ ఇండియా(team india) అద్భుతంగా ప్రారంభించింది. 515 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో చెన్నై టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ముందుగా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆరు వికెట్లు
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఆ క్రమంలో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆదివారం జరిగిన తొలి సెషన్‌లో కొద్దిసేపటికి బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. టీమిండియా విజయంలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.
అశ్విన్ 37వ సారి
దీంతో చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రవిచంద్రన్ అశ్విన్ విధ్వంసం సృష్టించి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్ టెస్టులో 37వ సారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ విషయంలో అశ్విన్ షేన్ వార్న్‌ను సమం చేశాడు.
జడేజా
అశ్విన్ శనివారం వరకు మూడు వికెట్లు తీయగా, నేడు మరో ముగ్గురిని ఔట్ చేశాడు. బంగ్లాదేశ్ తరఫున నజ్ముల్ హుస్సేన్ శాంటో అత్యధికంగా 82 పరుగులు చేశాడు. ఆదివారం బంగ్లాదేశ్ నాలుగు వికెట్లకు 158 పరుగుల వద్ద ఆట ప్రారంభించింది. 76 పరుగులు చేసిన క్రమంలో మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. ఇదే మ్యాచులో జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇక రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది.
ఇవి కూడా చదవండి:
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read Latest Sports News and Telugu News
Updated Date - Sep 22 , 2024 | 11:57 AM