Womens Asia Cup 2024: మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు
ABN, Publish Date - Jul 25 , 2024 | 01:28 PM
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మహిళల ఆసియా కప్ 2024(Womens Asia Cup 2024) ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్లోకి నాలుగు జట్లు వచ్చి చేరగా, రేపు రెండు సెమీ ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. గెల్చిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ (final match) జులై 28న జరుగుతుంది. కానీ ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్ విషయంలో కీలక మార్పు చేశారు. అదేంటంటే టైమింగ్ మార్చబడింది(timing changed). ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటల నుంచి జరగాల్సి ఉండగా, ఇప్పుడు దాని సమయాన్ని మార్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతుందని ప్రకటించారు.
కారణమిదేనా
ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని ఏసీసీ తెలిపింది. ఫైనల్ డేట్ మారలేదు, కానీ టైమింగ్ మాత్రమే మార్చబడిందన్నారు. కానీ దీని వెనుక కారణం ఎందుకనేది మాత్రం చెప్పలేదు. అయితే అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి భారత్-శ్రీలంక మధ్య పురుషుల టీమ్ మ్యాచ్ ఉంటుందని క్రీడా వర్గాలు అంటున్నారు. రెండు మ్యాచ్‌లు ఒకేసారి జరగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైతే, అది 7 గంటలలోపు ముగుస్తుంది. దీని తర్వాత భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ మొదలు కానుంది.
రసవత్తర పోరు
ఆసియా కప్ 2024లో భారత్(India), పాకిస్థాన్(Pakistan)తో.. బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంక(sri lanka)తో సెమీ ఫైనల్లో ఆడనున్నాయి. మిగిలిన జట్ల ఆట ఇప్పటికే ముగిసింది. జులై 26న జరిగే తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగనుంది. ఆ తర్వాత రెండో సెమీస్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ ఆడనుంది. ఇదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. రెండు తుది జట్లు ఒకే రోజు తలపడనున్నాయి. ఈ మ్యాచుల ఒకరోజు గ్యాప్ తర్వాత ఫైనల్స్ మ్యాచ్ జులై 28న ఉంటుంది.
ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉండగా, మరోవైపు గ్రూప్ బీలో శ్రీలంక జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు కూడా చెరో మూడు మ్యాచులు ఒక్కటి కూడా ఓడిపోకుండా గెలిచాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరులో కూడా ఇదే జట్లు తలపడనున్నాయని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Hardik Pandya: విడాకుల తర్వాత నటాషా పోస్ట్‌కి హార్దిక్ స్పందన.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Gold and Silver Prices Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 25 , 2024 | 01:39 PM