ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:08 AM

టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024)లో అగ్రరాజ్యం అమెరికా(america) జట్టు మళ్లీ వావ్ అనిపించింది. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్‌(Pakistan) జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ జట్టు మాత్రం 13 పరుగులకే పరిమితమైంది.

USA beat Pakistan by 5 runs in Super Over

టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024)లో అగ్రరాజ్యం అమెరికా(america) జట్టు మళ్లీ వావ్ అనిపించింది. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్‌(Pakistan) జట్టును చిత్తుగా ఓడించి విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్తాన్ జట్టు మాత్రం 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో పాక్ జట్టుపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

అంతకుముందు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన అమెరికా జట్టు కూడా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచులో సూపర్ ఓవర్‌ వేయాలని నిర్ణయించగా, చివరకు అమెరికా గెలిచింది.


దీంతో అమెరికా(United States) జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. డల్లాస్‌(Dallas)లోని గ్రాండ్ ప్రియరీ స్టేడియం(Grand Prairie Stadium)లో ఈ మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్‌లో అమెరికా తొలుత బ్యాటింగ్ చేయగా అమెరికా తరపున, హర్మీత్ సింగ్, ఆరోన్ జోన్స్ బ్యాటింగ్‌కు వచ్చారు. పాకిస్తాన్ తరపున మహ్మద్ అమీర్‌ను కెప్టెన్ బాబర్ బౌలింగ్ చేశారు. కానీ మహ్మద్ అమీర్ సూపర్ ఓవర్‌లో 18 పరుగులు ఇవ్వడం మ్యాచ్‌ను మార్చేసింది. అంతేకాదు ఈ మ్యాచ్ మొత్తంలో పాకిస్థాన్ ఫీల్డింగ్ పేలవంగా ఉందని చెప్పవచ్చు.


దీంతో అమెరికా(america) ఆటగాళ్లు భారీగా సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో గెంతులు వేశారు. ఆ క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం నిరాశగా కనిపించారు. 2022లో పాకిస్థాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఓడించగా, ఇప్పుడు ఈ టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచుకే ఇంత క్రేజ్ ఉంటే ఇక జూన్ 9న న్యూయార్క్‌లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి..

Sunil Chhetri : మెరుపు వీరుడి వీడ్కోలు


Indonesia Open : క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2024 | 07:43 AM

Advertising
Advertising