Paris Olympics: ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్..
ABN, Publish Date - Aug 07 , 2024 | 02:48 PM
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్స్‌లో విజయం సాధించి ఫైనల్స్‌కు ప్రవేశించింది. కొద్దిగంటల్లో ఫైనల్స్ ఆడేందుకు సిద్ధమవుతుండగా.. ఆమె ఉండాల్సిన బరువుకంటే 150 గ్రాములు ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. రాత్రి అంతా బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉదయం బరువు పరీక్షించే సమయానికి ఆమె 50 కేజీలకు మించి బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధిస్తుందని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షించారు. కానీ అధిక బరువు కారణంగా ఆమె లక్ష్యం నెరవేరకుండా పోయింది.
Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ
ఒలింపిక్ విలేజ్‌లో చికిత్స..
వినేష్ ఫోగట్ ప్రస్తుతం ఒలింపిక్ విలేజ్‌లోని క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. బరువు తగ్గడం కోసం రాత్రి అంతా ఆమె కసరత్తు చేశారు. ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుపై అప్పీల్ చేయడానికి భారత ఒలింపిక్స్ కమిటీ వద్ద ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేకపోవడంతో ఆమె పోటీలో నుంచి తప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. వినేష్ ఫోగట్ బరువును తగ్గించడానికి ఆమె కోచ్, సహాయక సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. జుట్టు కత్తిరించడం, రక్తాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఫోగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ ఆడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్
పిటి ఉషకు పీఎం ఫోన్..
వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిందన్న వార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో బాధకరంగా ఉన్నప్పటికీ మరిన్ని విజయాలకోసం ప్రయత్నం చేస్తుండాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పిటి ఉషతో ప్రధాని మాట్లాడారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నింబధనల ప్రకారం బరువు నిరూపించుకోవడంలో విఫలమైతే ఆ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణిని పోటీల నుంచి అనర్హులుగా ప్రకటిస్తారు. తాను ఏదైనా పతకం గెలిచినా అది అందించరు.
నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం
సెమీస్‌లో..
బరువు ఎక్కువుగా ఉండటంతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కేజీల మహిళల విభాగంలో ఫైనల్స్ ఆడేందుకు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్ మంగళవారం రాత్రి క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్‌మాన్‌ను 5-0తో ఓడించి ఫైనల్స్‌కు చేరింది. దీంతో రెజ్లింగ్ మహిళల విభాగంలో ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. ఫైనల్స్‌లో పసిడి పతకం సాధిస్తుందనుకున్న సమయంలో బరువు రూపంలో ఓ విచారకరమైన వార్త వెగులుచూసింది. దీంతో ఎటువంటి పతకం లేకుండానే వినేష్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News
Updated Date - Aug 07 , 2024 | 02:48 PM