ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup 2024: T20I నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్

ABN, Publish Date - Jun 30 , 2024 | 07:11 AM

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.

Virat Kohli and Rohit Sharma announced retirement

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ తాను అనుకున్నది సాధించానని చెప్పాడు. భారత్‌కు ఇదే తన చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ అని వెల్లడించారు. కొన్ని గంటల తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20కి రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం అధికారిక మీడియా సమావేశంలో భారత కెప్టెన్ ప్రకటించాడు. భారత్ విజయవంతమైన ప్రచారంలో కీలక పాత్ర పోషించిన రోహిత్, వన్డేలు, టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ధృవీకరించారు.


సూర్య క్యాచ్

బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా(team india) ఓడిపోతుందనుకున్న తరుణంలోనే థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరకు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా భారత్‌ను గెలుపుతీరాలకు తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ బౌండరీ వద్ద డేవిడ్ మిల్లర్‌ క్యాచ్ పట్టిన తీరు అద్భుతమని చెప్పవచ్చు. ఈ క్యాచ్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. 16 పరుగులు డిఫెండింగ్‌లో ఉండగా అతను రెండు వికెట్లు పడగొట్టి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో భారత జట్టు 17 సంవత్సరాల తర్వాత T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఎదురు చుశాం

టీ20 వరల్డ్ కప్ 2024(T20 World Cup 2024) టైటిల్ గెలిచిన తర్వాత, ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్ అని, ఇదే మేము సాధించాలనుకున్నామని 35 ఏళ్ల విరాట్ కోహ్లీ(Virat Kohli) చెప్పాడు. ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి అవకాశం. ఇప్పుడు తర్వాత తరం బాధ్యతలు స్వీకరించే సమయం వచ్చింది. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మేము చాలా కాలంగా ఎదురు చుశాము. ఇది నా ఆరో ప్రపంచకప్. ఇది అద్భుతమైన రోజు, నేను కృతజ్ఞతతో ఉన్నాను. 2024 టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలుచుకోవడంలో విరాట్‌ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు విరాట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.


ఇదే మంచి సమయం

సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 92 పరుగులు చేసిన 37 ఏళ్ల రోహిత్ శర్మ(rohit sharma).. టైటిల్ కోసం తాను 'డెస్పరేట్'గా ఉన్నానన్నాడు. ఇది నా చివరి మ్యాచ్ అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపాడు. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. నేను ఈ ట్రోఫీని చాలా కోరుకున్నాను. దాన్ని మాటల్లో వివరించడం చాలా కష్టం. నేను కోరుకున్నది జరిగింది. నా జీవితంలో దీని కోసం చాలా ఎదురు చుశాను. ఈసారి లక్ష్యాన్ని చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం దేశానికి అపారమైన ఆనందం, గర్వాన్ని తెచ్చిపెట్టిందని రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి:

T20 World Cup Winner India : కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

థాంక్యూ.. ద్రవిడ్‌


ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 07:27 AM

Advertising
Advertising