Virat Kohli: 47 పరుగులకే విరాట్ అవుట్..కానీ అరుదైన రికార్డులు సాధించిన కోహ్లీ
ABN, Publish Date - May 18 , 2024 | 09:16 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఆర్‌సీబీతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ బ్యాటింగ్ చేసిన క్రమంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ మ్యాచులో 29 బంతుల్లో 47 పరుగులు చేసి ఔట్ అయిన విరాట్ ఐపీఎల్‌లో ఒకే వేదికపై 3000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 13 పరుగులకు చేరుకున్నప్పుడు ఈ ఘనతను సాధించాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2295 పరుగుల చేసిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(rohit sharma) తర్వాత స్థానంలో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ(Virat Kohli) నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టి కోహ్లీ ఈ ఘనత సాధించాడు. IPL చరిత్రలో 700 లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, అతని పేరు మీద 768 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు భారీ తేడాతో చెన్నైని ఓడిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..
Read Latest Sports News and Telugu News
Updated Date - May 18 , 2024 | 09:20 PM