ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Womens Asia Cup Final: నేడు మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్ పోరు.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే..

ABN, Publish Date - Jul 28 , 2024 | 09:21 AM

మహిళల ఆసియా కప్ 2024లో(Womens Asia Cup 2024) భారత జట్టు(team india) సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక(srilanka)తో భారత్ నేడు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.

Womens Asia Cup 2024 finals

మహిళల ఆసియా కప్ 2024లో(Womens Asia Cup 2024) భారత జట్టు(team india) సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక(srilanka)తో భారత్ నేడు తలపడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లు కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో నేటి మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగనుంది. ఈ టైటిల్ గెల్చుకోవడం ద్వారా భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవాలంటే శ్రీలంక కెప్టెన్‌ను నియంత్రించాల్సి ఉంటుంది. భారత్‌ పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌పై శ్రీలంక బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది.


గెలుపు ఛాన్స్

మరోవైపు శ్రీలంక కూడా ఇప్పటి వరకు అజేయంగా ఉంది. టోర్నీలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని కూడా సాధించారు. గ్రూప్ దశలో శ్రీలంక(srilanka) 144 పరుగుల తేడాతో మలేషియాను ఓడించింది. ఇప్పటి వరకు శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అటపట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె ఇప్పటివరకు 243 పరుగులు చేసింది. కానీ ఆమె తప్ప, మరే ఇతర శ్రీలంక బ్యాట్స్‌మెన్ 100 పరుగులను చేరుకోలేదు. ఈ క్రమంలో ఉమెన్స్ టీమిండియా జట్టును కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచులో ఇరు జట్లు గెలిచేందుకు సమాన అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు అంటున్నాయి.


టాప్ ఆర్డర్

లీగ్ దశలో భారత్(bharath) పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో, యూఏఈపై 78 పరుగులతో, నేపాల్‌పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఇప్పటి వరకు బాగానే రాణించారు. టోర్నీలో ఇప్పటివరకు దీప్తి అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టగా, రేణుక ఏడు వికెట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరి ఎకానమీ రేట్ కూడా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. వీరిద్దరి బలమైన బౌలింగ్‌తో ఇతర భారత బౌలర్లు కూడా లాభపడ్డారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ ఇప్పటివరకు 5.5 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టారు. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్‌లకు బ్యాటింగ్ చేయడానికి తక్కువ అవకాశాలు రావడంతో వారు కొంచెం ఆందోళన చెందారని చెప్పవచ్చు.


ఇరు జట్లు

ఉమెన్స్ టీమిండియా జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), ఉమా ఛెత్రి (WK), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజ్నా సజీవన్ ఉన్నారు.

మహిళల శ్రీలంక జట్టులో చమరి అటపట్టు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, విషమి గుణరత్నే, కావ్య కవింది, ఇనోషి ప్రియదర్శిని, సుగంధికా కుమారి, అచిని కులసూర్య, కవీషా నేషీల, శైనీస్ దిల్హారి గిమ్హాని కలరు.


ఇవి కూడా చదవండి:

Paris Olympics 2024: పారిస్ ఒలంపిక్స్‌లో తొలిరోజు ఆస్ట్రేలియాకు 5 మెడల్స్.. భారత్ విషయానికొస్తే..


Paris Olympics : తొలి స్వర్ణం చైనా ఖాతాలో..


first T20 India vs Sri Lanka : ‘టాప్‌’షోతో బోణీ


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 09:24 AM

Advertising
Advertising
<