ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Womens Asia Cup T20: నేటి నుంచే ఆసియా కప్ టీ20 పోరు.. పాకిస్థాన్‌, ఇండియా మధ్య తగ్గపోరు మ్యాచ్

ABN, Publish Date - Jul 19 , 2024 | 08:21 AM

నేటి (జులై 19న) నుంచి మహిళల ఆసియా కప్ టీ20(Women's Asia Cup T20 2024) టోర్నీ మొదలు కానుంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ ఈరోజు పాకిస్థాన్‌(Pakistan)తో టీమిండియా(team India) ఆడనుంది.

womens Asia Cup t20

నేటి (జులై 19న) నుంచి మహిళల ఆసియా కప్ టీ20(Women's Asia Cup T20 2024) టోర్నీ మొదలు కానుంది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ ఈరోజు పాకిస్థాన్‌(Pakistan)తో టీమిండియా(team India) ఆడనుంది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు మహిళల జట్టు నాలుగు T20 టైటిళ్లలో మూడింటిని, 50 ఓవర్ల ఫార్మాట్‌లో నాలుగింటిని గెలుచుకుంది. ఈ క్రమంలో నేడు జరిగే మ్యాచ్ కూడా గెలవాలని ఉమెన్స్ టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని రంగి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. అక్టోబర్‌లో జరిగే T20 ప్రపంచ కప్‌కు ముందు ఎనిమిది జట్లు తమ స్థానం కోసం పోటీపడనున్నాయి.


హోరాహోరీ రికార్డు

మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్(bharat) 20 మ్యాచ్‌లకు గాను 17 విజయాలు సాధించింది. 2022లో ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 14 మ్యాచ్‌లలో భారత్ 11 విజయాలు నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇదే ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో భారత్ 1-1తో డ్రా చేసుకుంది. మేలో ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో ఓడిన పాకిస్థాన్ ఈసారి గెలిచి తీరాలని చూస్తోంది.


టీమిండియా జట్టులో (india team) : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సజీవన్ సజ్నా, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, ఉమా ఛెత్రి(WK), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలు ఉన్నారు.

పాకిస్థాన్ జట్టులో(Pakistan team): సిద్రా అమీన్, ఒమైమా సోహైల్, ఇరామ్ జావేద్, నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునిబా అలీ(WK), డయానా బేగ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు కలరు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Cricket: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. వైరల్ అవుతున్న గంభీర్ నాలుగేళ్ల క్రితం ట్వీట్..


సూర్యకే పగ్గాలు


Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 08:28 AM

Advertising
Advertising
<