Champions Trophy: కోహ్లీ పేరుతో బీసీసీఐకి బ్లాక్‌మెయిల్.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Jul 26 , 2024 | 10:56 AM
వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆ టోర్నీ కోసం భారత్ వస్తుందా? లేదా? అనేది పాకిస్తాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత ఆటగాళ్లను పాకిస్తాన్ పంపించకుండా ఉండేందుకు బీసీసీఐ తన వంతు ప్రయత్నాలు తను చేస్తోంది.
వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆ టోర్నీ కోసం భారత్ వస్తుందా? లేదా? అనేది పాకిస్తాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత ఆటగాళ్లను పాకిస్తాన్ పంపించకుండా ఉండేందుకు బీసీసీఐ (BCCI) తన వంతు ప్రయత్నాలు తను చేస్తోంది. అయితే భారత్ జట్టు కచ్చితంగా పాకిస్తాన్ రావాల్సిందే అని ఆ దేశ మాజీ ఆటగాళ్లు కోరుతున్నారు. భారత ఆటగాళ్లకు తాము అద్భుతమైన ఆతిథ్యం అందిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఈ విషయమై స్పందించారు. మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ (Younis Khan) కూడా వారికి జత కలిశాడు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరుతో అతడు బీసీసీఐని బ్లాక్ మెయిల్ చేశాడు. కోహ్లీ కెరీర్‌లో వెలితిని పూడ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించాలని అన్నాడు. ``ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం కోహ్లీ పాకిస్తాన్ రావాలి. ఇది మా అందరి కోరిక. అతడు కెరీర్‌లో ఎన్నో సాధించాడు. కానీ పాక్‌కు రాకపోవడం ఒక్కటే వెలితిగా ఉండిపోయింది. కాబట్టి పాక్‌కు వచ్చి అతడు పరుగులు చేయాలి, సెంచరీలు బాదాలి`` అని యూనిస్ ఖాన్ అన్నాడు. కోహ్లీ తమ దేశానికి వస్తే ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపిస్తామన్నాడు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరుతోంది. భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలోని మైదానాల్లో నిర్వహించాలని అడుగుతోంది. అందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. భారత్ అంగీకరిస్తే ఆ జట్టు ఆడే మ్యాచ్‌లన్నింటినీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోనే నిర్వహిస్తామని చెబుతోంది.
ఇవి కూడా చదవండి..
Womens Asia Cup 2024: నేడు మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ పోరు.. ఫైనల్స్‌కు ఏ జట్లు వెళ్లే ఛాన్స్ ఉంది
Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..