Ad Revenue Program: ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇన్ కం ప్రొగ్రామ్.. 1,50,000 క్రియేటర్లకు ఇప్పటికే రూ.373 కోట్లు చెల్లింపు
ABN, Publish Date - Mar 20 , 2024 | 09:46 AM
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. ఈ క్రమంలోనే అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మంది క్రియేటర్లకు 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు.
గతంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి Xగా మార్చి అనేక మార్పులు చేశారు. అందులో భాగంగా దీనిలో ఆడియో, వీడియో కాల్స్, దీంతోపాటు టెక్స్ట్ కథనాలను షేర్ చేయడం వంటి ఫీచర్లను కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ క్రియేటర్‌లు ఎక్స్ యాప్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉందని గతంలో ఎలాన్ మస్క్ ప్రకటించారు.
ఈ క్రమంలో అర్హతగల సృష్టికర్తల కోసం 'యాడ్ రెవెన్యూ షేరింగ్' ప్రోగ్రామ్(ad revenue program)ను కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచంలోని అనేక మంది ఎక్స్‌లో వినూత్నమైన కంటెంట్‌ను పోస్ట్ చేసి ఎక్కువ వ్యూస్ సంపాదించడం ద్వారా ప్రతి నెలకు కొన్ని వందల డాలర్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే సృష్టికర్తలకు వారి పోస్ట్‌లకు ప్రత్యుత్తరాలలో ఇచ్చిన ప్రకటనల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని అందించడం ప్రారంభించింది. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఇది ప్రోత్సహిస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎక్స్ యాప్ ద్వారా కంటెంట్ సృష్టికర్తలు, క్రియేటర్లకు ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 150,000 కంటే ఎక్కువ మందికి 45 మిలియన్ డాలర్ల కంటే(రూ.3,73,54,50,000) ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు ఇటివల ప్రకటించారు. ఈ పథకానికి మీరు కూడా అర్హులైతే ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రొగ్రామ్ మానిటైజేషన్ చేసుకుని సంపాదించుకోండి మరి.
X బ్లాగ్ పోస్ట్ ప్రకారం బ్లూ చందాదారులు (గతంలో Twitter బ్లూ అని పిలుస్తారు) 500 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు లేదా గత మూడు నెలల్లో పోస్ట్‌లపై 15 మిలియన్ ఇంప్రెషన్‌లను కలిగి ఉన్నవారు ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌కు అర్హులుగా ఉంటారు. బ్లాగ్ ప్రకారం అర్హత ఉన్న వినియోగదారులు ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. యాప్ సెట్టింగ్‌లలో ‘మానిటైజేషన్’ విభాగానికి వెళ్లి చెల్లింపులను సెటప్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: భారత్‌లోనే విద్యుత్ కార్ల అసెంబ్లింగ్
Updated Date - Mar 20 , 2024 | 09:46 AM