ChatGPT: ఇకపై వాట్సాప్‌తో పాటూ ల్యాండ్‌లైన్‌లోనూ చాట్ జీపీటీ.. ఎలా వినియోగించాలంటే..
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:59 PM
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్‌డేట్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్‌కు పోటీగా గతంలో అనేక అప్‌డేట్‌లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై..
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్‌డేట్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్‌కు పోటీగా గతంలో అనేక అప్‌డేట్‌లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై వాట్సాప్‌తో పాటూ ల్యాండ్‌లైన్ ఫోన్లలోనూ చాట్ జీపీటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వివరాల్లోకి వెళితే..
తక్కువ కాలంలోనే ఎక్కవ ప్రజాదరణ పొందిన చాట్‌బాట్‌లలో ఒకటైన ChatGPT.. తాజాగా మరో ప్రకటన చేసింది. OpenAI చాట్ జీపీటీని ప్రస్తుతం వాట్సాప్, ల్యాండ్‌లైన్ ఫోన్లలోనూ వినియోగించుకోవచ్చిని ప్రకటించింది. ఇందుకోసం ల్యాండ్‌లైన్ నుంచి 1-800-242-8478 నంబర్‌కు డయల్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి నెలా 15 నిముషాల పాటు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చని, త్వరలో ఇందులో మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపింది. ఇదిలావుండగా, ఈ సేవలు ప్రస్తుతం అమెరికా, కెనడాలో మాత్రమే ప్రారంభించారు. త్వరలో ఇండియాలోనూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
WhatsAppలో ఇప్పటికే Meta AI అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ChatGPTని ఉపయోగించుకోవాలంటే 1-800-242-8478 నంబర్‌కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. OpenAI యాప్ తరహాలోనే ఇక్కడ కూడా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. అయితే ఇందులో ఇమేజ్‌లు, వాయిస్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా వినియోగించుకోవాలంటే మాత్రం అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే త్వరలో ఈ వెలుసుబాటును కూడా వాట్సాప్‌లో తీసుకొస్తామని కంపెనీ చెబుతోంది.
Updated Date - Dec 19 , 2024 | 12:59 PM