Cyber Security Tips: వాట్సాప్ హ్యాకింగ్ నివారించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ABN, Publish Date - Dec 14 , 2024 | 08:19 PM
దేశంలో ఇటివల కాలంలో డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇవి ఎక్కువగా వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో వాట్సాప్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా చిట్కాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రస్తుతం సైబర్ మోసాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆన్‌లైన్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. OTP స్కామ్‌ల నుంచి మొదలుకుని డిజిటల్ అరెస్ట్, ఫిషింగ్ స్కామ్‌ల వరకు అనేక మోసాలు జరుగుతున్నాయి.
మోసగాళ్లు సరికొత్త పద్ధతులను ఉపయోగించి అమాయక వినియోగదారుల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. మరికొంత మంది కేటుగాళ్లు ఆర్థిక సమాచారంతో పలువురి వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీటి విషయంలో వాట్సాప్‌ను ఉపయోగించి చాలా మోసాలు జరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న ఈ ముప్పుపై ప్రతిస్పందిస్తూ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఇటీవల కీలక సూచనలను జారీ చేసింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టూ స్టెప్ వెరిఫికేషన్
వాట్సాప్‌లో ఏదైనా ఆన్‌లైన్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి సులభమైన మార్గం టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయడం. ఇది ఏదైనా డిజిటల్ ఖాతాకు భద్రతకు భరోసా అని చెప్పవచ్చు. దీని కోసం ముందుగా మీరు WhatsApp > WhatsApp సెట్టింగ్‌లు > ఖాతా > టూ స్టెప్ వెరిఫికేషన్ ధృవీకరణ > ప్రారంభించండి > 6-అంకెల PINని సెట్ చేయండి > నిర్ధారించండి > ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి > తర్వాత ఈ రెండు-దశల తర్వాత ఆన్ అవుతుంది.
తెలియని లింకులకు
మీ వాట్సాప్ ఖాతాకు వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయకూడదు. ఆ క్రమంలో పంపిన వారి సందేశాలకు స్పందించకూడదని DoT తెలిపింది. వినియోగదారులను మోసం చేయడానికి మోసపూరిత ఫిషింగ్ స్కామ్‌లలో ఇటువంటి సందేశాలు తరచుగా పంపిస్తుంటారు. అంతేకాదు మీ నంబర్లను మీకు తెలియని గ్రూపులలో యాడ్ చేస్తుంటారు. అలాంటివి మీకు తెలియకుండా చేస్తే వెంటనే వాటి నుంచి ఎగ్జిట్ అవ్వండి.
తెలియని వీడియో కాల్స్
ఇటివల కాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా భారతదేశంలోని ప్రజలు ఈ మోసాల వల్ల కోట్లాది రూపాయలను కోల్పోయారు. దీన్ని నివారించడానికి వాట్సాప్ వినియోగదారులు తెలియని కాలర్‌ల నుంచి వచ్చే వీడియో కాల్‌లకు కూడా ఎప్పుడూ స్పందించవద్దని DoT తెలిపింది.
రివార్డుల పేరుతో
వాట్సాప్ వినియోగదారులకు రివార్డులు లేదా నగదు రివార్డులు వచ్చాయని తెలియని వారు పంపిన మెసేజులకు స్పందించకూడదు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేస్తే మీరు మోసపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వినియోగదారుల మీ ఆర్థిక డేటా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా మీ అకౌంట్ వివరాలను తెలియజేయోద్దు.
యాప్ అప్‌డేట్
మీ వాట్సాప్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. ఇది ప్రతిసారీ కొత్త ఫీచర్‌లను తీసుకొస్తుంది. ఇలాంటి క్రమంలో మీకు ముఖ్యమైన సెక్యూరిటీ బగ్‌ల పేరుతో వచ్చే సందేశాలు, యాప్ అప్‌డేట్ పేరుతో వచ్చే సందేశాల విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలి.
ఇవి కూడా చదవండి:
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Apple iPhone: ఫోన్ల చోరీ నుంచి రక్షణ కోసం క్రేజీ ఫీచర్.. వీటిలో మాత్రమే..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
For More Technology News and Telugu News
Updated Date - Dec 14 , 2024 | 08:20 PM