TRAI: ట్రాయ్ కొత్త రూల్స్.. సెప్టెంబర్ 1 నుంచి ఓటీపీ ట్రబుల్స్..
ABN, Publish Date - Aug 26 , 2024 | 08:23 PM
స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ తీసుకొస్తున్న కొత్త నిబంధనతో వినియోగదారులు ఇబ్బందుల్లో పడేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే TRAI కొత్త రూల్ ప్రకారం నకిలీ కాల్‌లు, సందేశాలను ఫిల్టర్ చేయనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.
అవాంఛిత కాల్స్‌పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ తీసుకొస్తున్న కొత్త నిబంధనతో వినియోగదారులు ఇబ్బందుల్లో పడేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే TRAI కొత్త రూల్ ప్రకారం నకిలీ కాల్‌లు, సందేశాలను ఫిల్టర్ చేయనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది అమలు చేసిన తర్వాత అవాంఛిత కాల్‌ల సమస్య చాలా వరకు తొలగిపోతుంది. కానీ నకిలీ సందేశాలు, కాల్‌లను ఫిల్టర్ చేయడంలో, బ్యాంకింగ్ సందేశాలు, OTPలను పొందడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
నమోదు
ఎందుకంటే సెప్టెంబర్ 1, 2024 నుంచి నమోదు చేసుకోని URLలు, OTT లింక్‌లు, APKలు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను కలిగి ఉన్న సందేశాలను బ్లాక్ చేయాలని TRAI టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సందేశాలు, OTP టెంప్లేట్‌లు, కంటెంట్‌ని Jio, Airtel, Vodafone-Idea వంటి టెలికాం ఆపరేటర్‌లతో ఆగస్టు 31 లోపు నమోదు చేసుకోవాలి. ఇది చేయకపోతే అటువంటి సందేశాలు ఆపివేయబడతాయి.
మార్పు ఏంటి?
సందేశాలు పంపించే సంస్థలు గతంలో టెల్కోలతో రిజిస్టర్ చేసుకున్నాయి. ఆ క్రమంలో లోపల కంటెంట్ ఏముందనే దానితో సంబంధం లేకుండా మెసేజ్ వస్తుండేవి. కానీ కొత్త నిబంధన ప్రకారం బ్లాక్ చెయిన్ ఆధారిత టెక్నాలజీ విధానికి టెలికాం కంపెనీలు మారాలి. ఆ క్రమంలో ప్రతి కమర్షియల్ మెసేజ్ చదవాలి. ఆ నేపథ్యంలో రికార్డులను అనుగుణంగా లేనివాటిని బ్లాక్ చేయాలి. వచ్చే నెల నుంచి టెలికాం కంపెనీలు వాణిజ్య సందేశాలను రికార్డ్‌లో మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టెలికాం కంపెనీలు కొత్త మార్పును అమలు చేయడానికి మరింత సమయం అడుగుతున్నాయి. అయితే గడువును పొడిగించేందుకు మాత్రం TRAI సిద్ధంగా లేదు.
వినియోగదారులపై ఎలాంటి ప్రభావం?
దీని ప్రత్యక్ష ప్రభావం మొబైల్ వినియోగదారులపై కనిపిస్తుంది. ఎందుకంటే OTPని అందుకోకపోతే మొబైల్ వినియోగదారులు ఆన్‌లైన్ చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఏదైనా వస్తువులు ఆన్‌లైన్‌లో డెలివరీ చేయబడితే, అందులో కూడా OTT అవసరం. ప్రస్తుతం ప్రతి లావాదేవీ OTT ద్వారా ధృవీకరించబడుతుంది. కానీ కొత్త నిబంధన అమలుతో OTT సందేశాలను స్వీకరించడంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభ రోజుల్లో మొబైల్ వినియోగదారులు కొన్ని సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
సందేశాలు వస్తే
TRAI నివేదిక ప్రకారం మీరు మీ వ్యక్తిగత మొబైల్ నంబర్ నుంచి టెలిమార్కెటింగ్ కాల్స్ చేస్తే మీ మొబైల్ నంబర్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్ చేయబడుతుంది. వాస్తవానికి టెలిమార్కెటింగ్ కోసం ప్రభుత్వం కొత్త మొబైల్ నంబర్ సిరీస్‌ను విడుదల చేసింది. ఆర్థిక మోసాలను నివారించడానికి టెలికమ్యూనికేషన్ల శాఖ కొత్త 160 నంబర్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్, బీమా రంగం 160 నంబర్ సిరీస్ నుంచి ప్రచార కాల్‌లు, సందేశాలను చేయాల్సి ఉంటుంది. మీకు అలాంటి సందేశాలు లేదా కాల్‌లు వచ్చినట్లయితే మీ ఫిర్యాదును ‘సంచార్ సతీ పోర్టల్’లో నమోదు చేయవచ్చు. ఎవరైనా మీకు 10 అంకెల మొబైల్ నంబర్ నుంచి సందేశం పంపితే మీరు దాని గురించి నేరుగా 1909కి ఫిర్యాదు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..
RBI: ఇకపై క్షణాల్లోనే లోన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Read More Technology News and Latest Telugu News
Updated Date - Aug 26 , 2024 | 08:25 PM