WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
ABN, Publish Date - Sep 30 , 2024 | 08:32 PM
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్‌కు ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం వాట్సాప్(WhatsApp) మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక ఇతర పనులకోసం తప్పనిసరి వాడకంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాప్‌ను సురక్షితంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయితే ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.
కొత్త నంబర్
మీ WhatsAppలో మీరు యాడ్ చేయని కొత్త వ్యక్తులు కూడా మీకు కనిపిస్తున్నట్లైతే మీ WhatsApp ఖాతాను మరొకరు ఉపయోగిస్తున్నారనే సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు వారు పరిచయం కోసం సందేశం పంపిస్తే అలాంటి వాటికి స్పందించకూడదు. ఎందుకంటే అనేక మంది హ్యాకర్లు ఇలాంటివి చేస్తుంటారు.
వాట్సాప్ లాగిన్
మీరు చాలాసార్లు ప్రయత్నించినా మీ వాట్సాప్ ఖాతాను తెరవలేకపోవడం లేదా లాగిన్ కాకపోవడం అప్పుడప్పుడు జరగవచ్చు. అలాంటి సమయంలో మీ వాట్సాప్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉండే అవకాశం ఉంది. వాట్సాప్ ఖాతా లాక్ చేయబడితే హ్యాకర్ లేదా మరొకరు మీ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారనే సంకేతంగా పరిగణించవచ్చు.
కోడ్ ధృవీకరణ
మీరు మీ వాట్సాప్‌లో వెరిఫికేషన్ కోడ్‌లను పదే పదే చూసినట్లయితే మీ ఖాతాను ఎవరో ట్యాంపర్ చేశారని అర్థం చేసుకోవాలి. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయినప్పటికీ హ్యాకర్లు వెరిఫికేషన్ కోడ్ కోసం రిక్వెస్ట్ పంపిస్తే ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓటీపీ
మీకు వాట్సాప్‌కు సంబంధించిన ఏదైనా సందేశం వస్తే అందులో రెండు దశల రిజిస్ట్రేషన్ కోడ్ లేదా ధృవీకరణ పిన్ డిమాండ్ చేయబడితే జాగ్రత్తగా ఉండండి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి లింక్‌పై క్లిక్ చేయకుండా ఉండాలి. మీ వాట్సాప్‌ను ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈ రకమైన సందేశానికి అర్థం. మీరు వారు పంపించిన లింక్‌పై క్లిక్ చేస్తే హ్యాకర్ మీ వాట్సాప్ యాక్సెస్ పొందుతారు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి.
ప్రొఫైల్ ఫోటో
WhatsAppలో మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి మీ WhatsApp ప్రొఫైల్ ఫోటోను చూడటానికి మీ పరిచయస్తులను మాత్రమే అనుమతించండి. ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేసి, ప్రైవసీకి వెళ్లి, ప్రొఫైల్ ఫోటోలోకి వెళ్లి 'మై కాంటాక్ట్స్'పై క్లిక్ చేయండి.
మనీ ట్రాన్స్‌ఫర్
ఇది కాకుండా వాట్సాప్‌లో డబ్బు అడిగే సందేశాలను నివారించండి. ఎప్పుడైనా డబ్బు బదిలీ చేయడానికి ముందు డబ్బు అడిగే వ్యక్తి నంబర్ ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. ఆ నంబర్ సరియైనదా లేదా ఫేక్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.
PM E DRIVE: ఈవీలు కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచి రూ. 50 వేల వరకు తగ్గింపు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
For More Technology News and Telugu News
Updated Date - Sep 30 , 2024 | 08:37 PM